శబరిమల ఆలయాన్ని నాశనం చేయాలని వారు ప్రయత్నిస్తున్నారు.. – వీహెచ్‌పీ

ఆచారాలు-సంప్రదాయాల విషయంలో రాజుకున్న రగడతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నకేరళలో ఇవాళ బంద్ నిర్వహించారు. సంఘ్ పరివార్ సీనియర్ నాయకురాలు, హిందూ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యకురాలు కేపీ శశికళ అరెస్ట్‌ను నిరసిస్తూ హిందూత్వ వర్గాలు బంద్ చేపట్టాయి. బంద్ నుంచి అత్యవసర సేవలు, అయ్యప్ప భక్తులు వెళ్లే వాహనాలకు మినహాయింపు ఇచ్చారు.

50 ఏళ్లు దాటిన కేపీ శశికళ, ఇరుముడితో శబరిమలకు వెళ్లడానికి ప్రయత్నిస్తే, పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారని శబరిమల కర్మ సమితి ఆరోపించింది. శబరిమల ఆలయాన్ని నాశనం చేయాలని విజయన్ సర్కారు భావిస్తోందని వీహెచ్‌పీ మండిపడింది. అన్ని వయసుల మహిళలు దర్శించుకోవచ్చంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మూడోసారి శబరిమలను తెరిచారు. రెండు నెలల పాటు సాగే మకరవిళక్కు పూజల కోసం ఈ నెల 16న అయ్యప్ప సన్నిధానాన్ని తెరిచారు.