నేటినుంచి పార్లమెంట్ సమావేశాలు.. ప్రతిపక్షాలు సై..

నేటినుంచి పార్లమెంట్ సమావేశాలు.. ప్రతిపక్షాలు సై..

parliament

వింటర్ సీజన్ లో వాడి వేడి రాజకీయాలకు పార్లమెంట్ వేదిక కాబోతోంది. ఒక్కో ఇష్యూతో అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సై అంటున్నాయి. విపక్షాల ప్రశ్నలకు ధీటుగా సమాధానం ఇస్తూ శీతాకాల సమావేశాల్లోనూ కీలక బిల్లులను ఆమోదించుకునే పనిలో ఉంది బీజేపీ. కాంగ్రెస్ ముఖ్యంగా ఆర్ధిక మాంద్యం, నిరుద్యోగంపై ఫోకస్ చేస్తోంది. ఇప్పటికే ఈ నెలాఖరులో భారీ ధర్నాకు ప్లాన్ చేసింది. అటు జమ్మూ కాశ్మీర్ లో గృహ నిర్బంధాలపైనా కేంద్రాన్ని కార్నర్ చేయాలనే లక్ష్యంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు రెడీ అయింది కాంగ్రెస్. చిదంబరం, ఫారూఖ్ అబ్దుల్లాను పార్లమెంట్ సెషన్ కు అనుమతించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

అటు అధికార పార్టీ కూడా అంతే ధీటుగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సిద్ధంగా ఉంది. పార్లమెంటు సమావేశాల్లో విపక్షాలు లేవనెత్తే అన్ని అంశాల్ని చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని క్లారిటీ ఇచ్చారు. పార్లమెంటు లైబ్రరీలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో జిరిగిన అఖిలపక్ష సమావేశంలో..ప్రతిపక్షాలు పలు అంశాలను లేవనెత్తాయి. అయితే..ఈ సారి కూడా సభ అత్యంత సమర్థంగా సాగాలని మోదీ ఆకాంక్షించారు. ఇక ఈ సారి రాజ్యసభ 250వ సెషన్ కావటంతో పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో రాజ్యసభ, లోక్ సభ సభ్యులు సమావేశం కానున్నారు.

ఆ తర్వాత ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. స్వల్ప విభేదాలున్నా దేశ ప్రయోజనాల కోసం సమిష్టిగా ముందుకు సాగాలని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను కోరారు. మహారాష్ట్రలో బీజేపీకి శివసేన దూరమైన నేపథ్యంలో స్వల్ప విభేదాలు, వైరుధ్యాలు ఎన్డీయేను బలహీనపరచలేవని మోదీ అన్నారు. మరోవైపు ఎన్డీయే భేటీ సానుకూలంగా జరిగిందని, తమ కూటమి దేశంలోని వైరుధ్యాలను ప్రతిబింబిస్తూ 130 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు అద్దంపడుతుందని సమావేశానంతరం ప్రధాని ట్వీట్‌ చేశారు. రైతులు, యువత, మహిళలు, నిరుపేదల జీవితాల్లో గుణాత్మక మార్పు సాధించేవరకూ తాము ఏ ఒక్క అవకాశాన్ని జారవిడుచుకోమని మోదీ అన్నారు.

గత బడ్జెట్ సమావేశాల్లో ఏకంగా 28 బిల్లులను సభలో ప్రవేశపెట్టి ఆమోదింపచేసుకుంది అధికారపార్టీ. ఇందులో ఆర్టికల్ 370 రద్దులాంటి కీలక బిల్లులు ఉన్నాయి. గత పదేళ్లలో ఇంత ఎక్కువగా బిల్లులను సభ ముందుకు తీసుకురావటం ఇదే తొలిసారి. ఇక ఈ సారి 27 బిల్లలును సభలో ప్రవేశపెట్టనున్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, అప్ఘానిస్తాన్ నుంచి వచ్చిన హిందూ, జైన్, క్రిస్టియన్, సిక్, బుద్ధిస్టులకు దేశ పౌరసత్వం కల్పించే బిల్లును ఈ సెషన్ లోనే ఆమోదింపజేసుకునే అవకాశాలున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story