ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. SSC నోటిఫికేషన్ విడుదల..

ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. SSC నోటిఫికేషన్ విడుదల..

chsl

కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ శాఖలు, కార్యాలయాలు, సంస్థల్లో లోయర్ డివిజనల్ క్లర్క్, పోస్టల్ అసిస్టెంట్ వంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది స్టాఫ్ సెలక్షన్ కమీషన్. ప్రతి ఏటా రెండు సార్లు కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (10+2) పరీక్ష జరుగుతుంది. ప్రస్తుతం రెండో దశ నోటిపికేషన్ విడుదలైంది. మరిన్ని వివరాల కోసం https://ssc.nic.in వెబ్‌సైట్‌ చూడొచ్చు. దరఖాస్తు కూడా వెబ్‌సైట్‌ ద్వారానే చేయాలి.

లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) / జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA), పోస్టల్ అసిస్టెంట్ (PA) / సార్టింగ్ అసిస్టెంట్ (SA), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO), డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2019 డిసెంబర్ 03.. దరఖాస్తుకు చివరి తేదీ: 2020 జనవరి 10

ఆన్‌లైన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 2020 జనవరి 12.. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మొదటి దశ: 2020 మార్చి 16 నుంచి 2020 మార్చి 27.. రెండో ధశ పరీక్ష (డిస్కిప్టీవ్ పేపర్): 2020 జూన్ 28

వయసు: 2020 జనవరి 1 నాటికి 18 నుంచి 27 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, అన్‌రిజర్వ్‌డ్ వికలాంగులకు 10 ఏళ్లు, అన్‌రిజర్వ్‌డ్ ఓబీసీలకు 13 ఏళ్లు, అన్‌రిజర్వ్‌డ్ ఎస్సీ, ఎస్టీలకు 15 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది. ఫీజు: రూ.100.. విద్యార్హత: లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) / జానియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA), పోస్టల్ అసిస్టెంట్ (PA) / సార్టింగ్ అసిస్టెంట్ (SA), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) పోస్టులకు 12వ తరగతి పాస్ కావాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ పోస్టులకు సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో 12వ తరగతి పాస్ కావాలి.

Read MoreRead Less
Next Story