ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీ ఖరారు

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీ ఖరారు

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు మార్గం సుగమమైంది. జూన్ 4 ఓట్ల లెక్కింపు జరపనున్నారు. ఎంపీటీసీ, జేడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఆ తరువాత స్వల్ప విరామంతోనే చైర్ పర్సన్ల ఎన్నిక జరగనుంది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టాన్ని రాష్ట్ర ప్రభత్వం సవరించి.. ఆర్డినెన్స్ కూడా జారీ చేసింది.

తెలంగాణలో ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీని ఖరారు చేసింది ఎన్నికల సంఘం… జూన్ 4న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. కొత్తగా ఎంపికయ్యే ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారానికి ముందే ఛైర్‌పర్సన్లను ఎన్నుకునే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు 2018 పంచాయతీ రాజ్ చట్టంలోని 147, 176 సెక్షన్లకు సవరణ చేస్తూ సోమవారమే ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. జూన్ 4న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని.. అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం.

రాష్ట్రంలో మూడు దశల్లో మే 6, 10, 14 తేదీల్లో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఈ నెల 14న ముగిశాయి. ఈ ఎన్నిలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఈ నెల 27న చేపట్టాలని ఎన్నికల సంఘం ముందుగా నిర్ణయించింది. అయితే రాజకీయపక్షాల విజ్ఞప్తి మేరకు మే 27న నిర్వహించాల్సిన కౌంటింగ్‌ను ఎస్‌ఈసీ వాయిదా వేసింది. తాజాగా జూన్‌ 4 ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు ప్రకటించింది.

తెలంగాణలో కొత్తగా ఎన్నికయ్యే మండల ప్రజా పరిషత్‌లు, జిల్లా ప్రజా పరిషత్‌ల పదవీకాలం జులై మొదటి వారం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఉమ్మడి ఖమ్మంలో జులై 4 నుంచి, మిగతా జిల్లాల్లో జులై 3 నుంచి ప్రారంభం కానుంది. అయితే, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు పూర్తయితే మొదటి సమావేశం జరగాలంటే వారు మరో నెలపాటు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితాలు వెల్లడై, ఛైర్‌పర్సన్ల ఎంపిక కోసం నెల రోజులు ఆగాల్సిన పరిస్థితి తలెత్తితే.. అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేసే ప్రమాదం ఉందని ప్రతిపక్షాల వాదించాయి. దీంతో ఎన్నికల సంఘం ఏకీభవించి ఈ నిర్ణయం తీసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story