కడుపులో పిండాన్ని పూల కుండీలో పూడ్చి పెట్టి.. ఓ అమ్మ చేసిన పని..

ఓ బిడ్డకు జన్మనివ్వడం అంటే 'ఆమె'కు మరో జన్మ ఎత్తినంత.. అయినా అపురూపంగా 9 నెలలు మోసి.. పండంటి బిడ్డను కని.. తను పడ్డ బాధనంతా మరిచి.. పుట్టిన బిడ్డను పొత్తిళ్లలో పొదువుకుంటుంది. తన రక్తాన్ని చనుబాల రూపంలో బిడ్డ నోటికి అందిస్తుంది. అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటుంది. అలాంటి ఆనందాన్ని అనుభవించకుండానే ఆమె ఆశలను నీరుగారుస్తూ కడుపులో పెరుగుతున్న బిడ్డ 14 వారాలకే చనిపోతే.. ఆ తల్లి బాధ వర్ణానాతీతం. చెత్త కుండీలో ఆ పిండాన్ని పడేయడానికి తల్లి మనసు ఒప్పుకోలేదు. అందుకే తనతో పాటే.. తన కళ్లముందే ఉంచుకోవాలనుకుంది. అదెలా సాధ్యం అంటే.. మాతృహృదయ ఆవేదనకు అద్దం పట్టే ఈ ఘటన అమెరికాలోని మిస్సోరీలో చోటు చేసుకుంది.
శర్రాన్ సుదేర్లాండ్ గర్భం దాల్చింది. రెగ్యులర్‌గా చెకప్‌లకు వెళుతూనే ఉంది. ఓ రోజు కడుపు నొప్పిగా ఉందంటూ ఆసుపత్రికి వెళ్లింది శర్రాన్. ఆమెని పరీక్షించిన వైద్యులు కడుపులోని పిండం గుండె కొట్టుకోవడం లేదని గమనించారు. వెంటనే తొలగించాలన్నారు. ఇది విన్న శర్రాన్ కన్నీరు మున్నీరైంది. మందుల ద్వారా కడుపులో పిండాన్ని తొలగిస్తామన్నారు. అందుకు శర్రాన్ ఒప్పుకోలేదు. పిండాన్ని ముక్కలు చేయకుండా తనకు అందించమని వైద్యులను కోరింది. అందుకు డాక్టర్లు సిజేరియన్ ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందన్నారు. సిజేరియన్ చేయించుకుని శర్రాన్ పిండాన్ని ఇంటికి తీసుకుని వెళ్లింది. నా బిడ్డలో అవయవాలన్నీ సక్రమంగా ఉన్నాయి. కానీ గుండె పని చేయడం మాత్రం మానేసింది. దాంతో నా బిడ్డను ఈ స్థితిలో చూడాల్సి వచ్చింది. ఇంకో 175 రోజులు వుంటే నా బిడ్డను ఇలా చూసుకునే పరిస్థితి ఉండేది కాదు. డాక్టర్లు పిండాన్ని 'మెడికల్ వేస్ట్' అని అనడం నచ్చలేదు. అందుకే ఇంటికి తీసుకొచ్చుకున్నాను అని శర్రాన్ భావోద్వేగానికి గురైంది. 14 వారాలకే పూర్తిగా అవయవాలన్ని తయారైన తన గర్భస్థ పిండాన్ని పడేయాలనిపించలేదు. దాన్ని తీసుకుని సిలైన్ సీసాలో పెట్టి ఇంట్లోని ఫ్రిజ్‌లో ఉంచి రోజూ చూసుకునేది. తన బిడ్డ తనతో పాటే ఉందని మనసుకు చెప్పుకునేది. బంధువులు, స్నేహితులు మరణించిన పిండాన్ని ఇంట్లో ఉంచడం సరికాదన్నారు. దాంతో తన బిడ్డ తనతోనే ఉండే మార్గం గురించి ఆలోచించింది. లోకం తన గురించి తప్పుగా అనుకున్నా ఫరవాలేదని ఓ నిర్ణయం తీసుకుంది. ఇంటి ఆవరణలో కుండీలో పెరుగుతున్న ఓ పూల కుండీలో ఈ పిండాన్ని ఉంచింది. ఇకపై నా బిడ్డ ఈ మొక్క రూపంలో ఎదుగుతుంది అని కళ్ల వెంట జారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ చెబుతోంది. పూచే ప్రతి పువ్వులో నా బిడ్డ ప్రాణం ఉంటుంది అని ఆనందపడుతోంది.
RELATED STORIES
Nani: నాని కెరీర్లో మొదటిసారి.. పాన్ ఇండియా దర్శకుడితో సినిమా..
23 May 2022 3:23 PM GMTManchu Vishnu: మంచు విష్ణుతో జెనీలియా.. క్రేజీ పోస్ట్ వైరల్..
23 May 2022 1:30 PM GMTKushi 2022: శరవేగంగా 'ఖుషి' షూటింగ్.. ఇంతలోనే మరో అప్డేట్..
23 May 2022 12:15 PM GMTMajor: 'మేజర్' మూవీ టీమ్ సూపర్ ప్లాన్.. ఫస్ట్ టైమ్ ఇలా..
23 May 2022 10:39 AM GMTPayal Rajput: స్టేజ్‌పైనే బాయ్‌ఫ్రెండ్‌కు లిప్ లాక్ ఇచ్చిన హీరోయిన్..
22 May 2022 2:45 PM GMTBalakrishna: బాలయ్య సరసన బిగ్ బాస్ విన్నర్.. కీలక పాత్రలో మరో యంగ్...
22 May 2022 2:13 PM GMT