తాజా వార్తలు

క్లైమాక్స్ లో కలిసొచ్చిన పాలిటిక్స్ ను క్యాష్ చేసుకుంటున్న ఓటర్లు

క్లైమాక్స్ లో కలిసొచ్చిన పాలిటిక్స్ ను క్యాష్ చేసుకుంటున్న ఓటర్లు
X

స్థానిక సంస్థల ఎన్నికలకు కొద్ది గంటలు మాత్రమే మిగిలింది. మే 31న ఓటింగ్ ఉండటంతో ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేసాయి. ఇప్పటికే అధికార పార్టీ టీఆర్ఎస్ జెడ్పీటీసీ, ఎంపీటీసీలను క్యాంపులకు తరలించింది. నియోజక వర్గాల వారీగా సీనియర్ నాయకులకు ఓటర్ల బాధ్యతలను అప్పగించింది అధిష్టానం. అటు కాంగ్రెస్ కూడా ఓటర్లను కాపాడుకునేందుకు క్యాంప్ పాలిటిక్స్ ను ముమ్మరం చేసింది. ఇదే అదనుగా ఓటర్ల తమ గొంతెమ్మ కోర్కెల చిట్టాను అభ్యర్ధుల ముందు పెడుతున్నారు.

మరికొద్ది రోజుల్లో ప్రస్తుత ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీ కాలం ముగిసిపోనుంది. క్లైమాక్స్ లో కలిసొచ్చిన ఈ క్యాంప్ పాలిటిక్స్ ను క్యాష్ చేసుకుంటున్నారు ఓటర్లు. అటు పార్టీలు కూడా బలమైన అభ్యర్ధులను బరిలోకి దింపటంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పోటీ తీవ్రంగానే ఉంది. ఒక్క ఓటును కూడా సీరియస్ గా తీసుకుంటున్నాయి పార్టీలు. క్యాంపులు నిర్వహిస్తున్న నేతలు జిల్లాలోని ఒక్కో నియోజకవర్గం వారీగా జడ్పీటీసీ, ఎంపీటీసీలను తరలిస్తున్నారు. అందరిని ఓకే చోటకు తరలించడం వల్లా ఇబ్బందులు తలెత్తుతాయని బావించిన నేతలు…. ఓక్కో శిబిరంలో ఒక్కో నియోజక వర్గం ఓటర్లను తీసుకెల్తున్నారు. ఆయా శిబిరాల్లో సకల సదుపాయాలు కల్పిస్తున్నారు.

ఇప్పటికే వరకు హైదరాబాద్ చుట్టు పక్కన పలు రిసార్టుల్లో క్యాంపులు నిర్వహిస్తున్నారు అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్ధులు. ఈ పోటీని సద్వినియోగం చేసుకుంటున్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు క్యాంప్ లకు వెళ్లేందుకు ఒక్కొక్కరు ఒక్కో కండీషన్ తో అభ్యర్ధులకు చుక్కలు చూపిస్తున్నారు. కొంత మంది ఓటర్లు తమను గోవా, కేరళ, కాశ్మీర్, లాంటి ప్రదేశాలకు తీసుకెళ్లాలని క్యాంపు నిర్వహకులను కోరుతున్నారట. మరికొందరైతే ఏకంగా ఫ్యామిలి ప్యాకేజీని అడుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక మహిళా జెడ్పీటీసీలు తమతో పాటు తమ కుటుంభ సభ్యులను తీసుకెళ్తామని పట్టుబడుతున్నారట. దీంతో ఖర్చు తడిసి మోపెడు అవుతుందని అభ్యర్దులు తలలు పట్టుకుంటున్నారట.

Next Story

RELATED STORIES