ఈ పాపం చేసింది ఎవరు?

ఈ పాపం చేసింది ఎవరు?

ముంబైలోని ఒక వైద్య కళాశాలలో పీజీ చేస్తున్న విద్యార్థిని డాక్టర్‌ పాయల్‌ తాడ్వీ గత బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆత్మహత్య దేశ వ్యాప్తంగా
చర్చనీయాంశంగా మారింది. వైద్య విద్యాను అభ్యసిస్తున్న పాయల్‌ కుల వివక్ష కారణంగా బలైపోయింది. ఆదివాసీ తెగకు చెందిన ఆమె ఉన్నత ఆశయంతో వైద్య విద్యను అభ్యసించాలనే కోరకతో కష్టపడి చదివి మెడిసిన్ సీటును సాధించింది. చదువుకునేవారు తక్కువగా ఉండే వారి తెగలో తాను ఏకంగా వైద్యరంగంలో పీజీ కోర్సుకు చేరుకుంది. ఉన్నత స్థాయికి చేరుకోవాలని తపనపడిన ఆ ఆదివాసీ యువతి కలలు కుల రక్కసికి చేతిలో చిక్కుకుని ఛిద్రంకావడం విషాదకరం.

తను చదువుకుంటున్న కళశాల హస్టల్ రూంలో ముగ్గురు యువతులు పాయల్ కలిసి ఉంటుంది. వారి కారణంగానే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని
సాయల్ తల్లిదండ్రులు ఆరోపిస్తాన్నారు. ఆధిపత్య కులాలకు ఆ యువతులు కులం పేరుతో నిత్యం ఆమెను వేధించేవారని ఈ విష యమై కళాశాల నిర్వాహకులకు ఫిర్యాదు చేశానని పాయల్‌ తల్లి చెబుతున్నారు. అయినప్పటికీ అక్కడ జరుగుతున్న కులవివక్షపై ఎలాంటి చర్యలు లేకపోవడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతంగా ఎదిగేందుకు దోహదపడాల్సిన ఉన్నత శ్రేణి విద్యా సంస్థలు కుల, మతాల రొంపిలో కూరుకుపోతుండటం ఆందోళన కలిగించే అంశం. రాకేట్ యుగంలో కూడా కుల వివక్ష, కొనసాగుతుండడం ప్రస్తుత సమాజ ధోరణి అద్దం పడుతుంది. ఇప్పటికైనా సకల జాడ్యాల నుంచీ విద్యాసంస్థల్ని కాపాడుకోవాలి.

Tags

Read MoreRead Less
Next Story