ప్రాణాలకు తెగించి ఇద్దరిని కాపాడిన పోలీస్ అధికారి..

ప్రాణాలకు తెగించి ఇద్దరిని కాపాడిన పోలీస్ అధికారి..

ప్రజల ఆస్తులనే కాదు ప్రాణాలను కాపాడటంలో ముందుంటామని నిరూపించాడో పోలీస్ అధికారి. చేపల కోసం బావిలోకి దిగి ఉపిరాడక, ప్రాణాపాయస్థితిలో ఉన్న ఇద్దరిని ప్రాణాలకు తెగించి కాపాడి స్థానికుల ప్రశంసలందుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది.

జమ్మికుంట మండలం మిడిపల్లిలో గ్రామంలో మల్లయ్య, రవీందర్ చేపలు కోసం మంచి నీటి బావిలోకి దిగారు. అయితే లోతు ఎక్కువగా ఉండడంతో ఊపిరాడక ప్రాణాపాయ స్థితిలోకి చేరుకున్నారు. దీంతో స్థానికులు పోలీసులకు, 108కి సమాచారం అందించారు. జమ్మికుంట సీఐ సృజన్ రెడ్డి తన బృందంతో సంఘటనా స్థలానికి వెళ్లారు. ఇద్దరిని కాపాడడానికి తానే బావిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. తాళ్ల సహాయంతో అందులోకి దిగిన సృజన్ రెడ్డి.. మల్లయ్య, రవీందర్‌లను సురక్షితంగా పైకి తీసుకొచ్చారు. ఎంతో ధైర్య సహాసాలతో ఇద్దరి ప్రాణాలు కాపాడిన సీఐకి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

మరోవైపు సీఐ సృజన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు ఆయన్ను అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. ఇద్దరి ప్రాణాలు కాపాడిన సృజన్‌కు సెల్యూట్‌ అని ప్రశంసించారు.

Tags

Read MoreRead Less
Next Story