పెళ్లికి రెడీ అయిన రాజ్ తరుణ్.. అమ్మాయి?

పెళ్లికి రెడీ అయిన రాజ్ తరుణ్.. అమ్మాయి?
X

షార్ట్ ఫిలింస్ చేసి సినిమాల్లోకి వచ్చిన రాజ్ తరుణ్.. అసిస్టెంట్ డైరక్టర్‌గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. తననే హీరోగా పెట్టి సినిమా తీస్తారని అస్సలు ఊహించలేదు. ఉయ్యాల జంపాల అంటూ తాను నటించిన మొదటి సినిమాతోనే హిట్ కొట్టి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తరువాత కుమారి 21 ఎఫ్.. సినిమా చూపిస్త మావా అంటూ వరుస సినిమాలు చేశాడు. మరికొన్ని సినిమాలు రాజ్ తరుణ్‌కి నిరాశను మిగిల్చాయి. ఇదిలా ఉండగా తాజాగా ట్విట్టర్‌లో ఆయన అభిమానులతో చాట్ చేసారు. ఇద్దరి లోకం ఒకటే అనే సినిమా చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇంకా తాను త్వరలో వివాహం చేసుకోనున్నట్లు తెలిపాడు. ఇంతకీ పెళ్లి కూతురు ఎవరనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇంతకీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని చేసుకుంటున్నాడా లేక కుటుంబ సభ్యులు చూసిన అమ్మాయిని చేసుకుంటున్నాడా అనేది మాత్రం సస్పెన్స్‌లో ఉంచాడు.

Next Story

RELATED STORIES