క్రైమ్

ఏలూరు మహిళా పోలీస్‌ స్టేషన్‌ వద్ద దారుణం..

ఏలూరు మహిళా పోలీస్‌ స్టేషన్‌ వద్ద దారుణం..
X

ఏలూరులో మహిళా పోలీస్‌ స్టేషన్‌ వద్ద దారుణం జరిగింది… భార్య కాపురనికి రావట్లేదంటూ భర్త ముత్యాలు బ్లేడుతో పీక కోసుకున్నాడు… తీవ్ర రక్తస్రావం అయి పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీసులు అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు… వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు…

ఏలూరు రూరల్‌ జాలిపూడిలో చేపల చెరువుకు కాపలా కాసే ముత్యాలుకు భార్య రత్నాలుకు మధ్య కొంతకాలంగా వివాదం జరుగుతోంది… రత్నాలు తన ఇద్దరు పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది… భార్యను ఇంటికి రమ్మని ముత్యాలు ఒత్తిడి తెస్తుండటంతో ఏలూరు మహిళా పోలీస్‌ స్టేషన్‌కు పంచాయితీ చేరింది.. భర్త వద్దకు వెళ్లనని రత్నాలు తెగేసి చెప్పడంతో మనస్థాపం చెందిన ముత్యాలు తన వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.

Next Story

RELATED STORIES