మామిడికాయలు కోశాడన్న అనుమానంతో..

మామిడికాయలు కోశాడన్న అనుమానంతో..

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం సింగంపల్లిలో బక్కి శ్రీను అనే వ్యక్తి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. మామిడికాయల కోశాడన్న అనుమానంతో అతనికి వ్యతిరేకంగా కొందరు పంచాయితీ పెట్టారు. ఈ అవమానం తట్టుకోలేక.. పంచాయితీ కార్యాలయంలోనే ఫ్యానుకు ఉరేసుకుని చనిపోయాడు శ్రీను. అయితే ఇది హత్యేనంటున్నారు శ్రీను బంధువులు. శ్రీను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ.. బంధువులు ఆందోళనకు దిగడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుల సంఘాల మధ్య వార్ గా మారింది.

రంగంలో దిగిన పోలీసులు.. పరిస్థితిని చక్కదిద్దారు. గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు.. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పంచాయితీ కార్యాలయంలో ఘటన జరగడంతో వీఆర్వోపై కేసు నమోదు చేశారు. నిందితులను త్వరలోనే బయటపెడతామన్నారు పోలీసులు. మరోవైపు.. పంచాయితీ కార్యాలయంలో ఆత్మహత్య చేసుకుంటే.. పోలీసుల వీఆర్వోను అరెస్టే చేయడం ఏంటని మండిపడుతున్నారు ఉద్యోగుల సంఘం నేతలు. మొత్తానికి అనుమానాస్పద మృతి ఉద్యోగులు, కులసంఘాలు, రాజకీయ పార్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story