తాజా వార్తలు

తెలంగాణాలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌

తెలంగాణాలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌
X

తెలంగాణలో ఖాళీ అయిన మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ లో ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ జిల్లాల జడ్పీటీసీ, ఎంపీటీసీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ పారదర్శకత కోసం వీడియోగ్రఫీ, వెబ్ కాస్టింగ్‌, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.

మూడు ఎమ్మెల్సీ స్థానాలకు 9 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. టీఆర్‌ఎస్ నుంచి రంగారెడ్డి జిల్లా స్థానానికి మాజీమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పోటీలో ఉన్నారు. ఇక నల్లగొండ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డి, కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి లక్ష్మి బరిలో నిలిచారు. వరంగల్ నుంచి ఎక్కువ మంది పోటీలో ఉన్నారు. ఇక్కడ టీఆర్‌ఎస్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఇనుగాల వెంకట్రాంరెడ్డి పోటీచేస్తుండగా.. మరో ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా బరిలో ఉన్నారు. జూన్‌ 3న ఓట్లు లెక్కిస్తారు.

వరంగల్, రంగారెడ్డి, నల్గొండ జిల్లా స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 2 వేల 799 మంది ఓటర్లు ఉండగా..మొత్తం 25 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. జెడ్పీటీసీలు ఉమ్మడి జిల్లా పరిషత్‌ కార్యాలయాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఐదారు మండలాలకు కలిసి ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో MPTCలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Next Story

RELATED STORIES