నమో టీం సిద్ధం..

నమో టీం సిద్ధం..

నమో టీం సిద్ధమైంది. నిన్న ప్రమాణస్వీకారం చేసిన 57 మంది మంత్రులకు శాఖలను కేటాయించారు ప్రధాని మోదీ. ఇన్ని రోజులు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా..నెంబర్‌ టూగా వ్యవహరిస్తున్న అమిత్‌ షాకు హోంశాఖను కేటాయించారు. గతంలో రక్షణ శాఖ నిర్వహించిన నిర్మలాసీతారామన్‌కు ఈ సారి ఆర్థిక శాఖను కేటాయించారు. గత ప్రభుత్వంలో హోంశాఖ బాధ్యతలు నిర్వహించిన రాజ్‌నాథ్‌ సింగ్‌కు రక్షణ మంత్రిత్వ శాఖను అప్పగించారు.

అనూహ్యంగా మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న మాజీ విదేశాంగ కార్యదర్శి ఎస్‌ జయశంకర్‌కు విదేశాంగ శాఖ దక్కింది. సదానందగౌడకు రసాయనాలు, ఎరువుల శాఖ… రవిశంకర్‌ ప్రసాద్‌కు న్యాయ, సమాచార, ఐటీ శాఖను కేటాయించారు. నితిన్‌ గడ్కరీకి ఎప్పటిలాగే రోడ్డు రవాణా, చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖను కేటాయించారు. రామ్‌విలాస్‌ పాస్వాన్‌కు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాలు…నరేంద్రసింగ్‌ తోమర్‌కు వ్యవసాయం, పంచాయతీ రాజ్‌ శాఖ బాధ్యతలు ఇచ్చారు.

ఎన్డీఏలో భాగస్వామి పక్షంగా ఉన్న అకాలీదళ్‌ ఎంపీ హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌కు ఈసారి కూడా ఫుడ్ ప్రాసెసింగ్‌ పరిశ్రమ బాధ్యలు అప్పజెప్పారు. ఇక పీయూష్‌ గోయల్‌కు రైల్వే, వాణిజ్యం, పరిశ్రమల శాఖ…ధర్మేంద్ర ప్రదాన్‌కు పెట్రోలియం శాఖ… ప్రహ్లాద్‌ జోషీకి పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనులశాఖ…మహేంద్రనాథ్‌ పాండేకు నైపుణ్యాభివృద్ధి శాఖను కేటాయించారు. థావర్‌ చంద్‌ గెహ్లాట్‌కు సామాజిక న్యాయం దక్కగా…రమేశ్‌ పొఖ్రియాల్‌కు మానవ వనరుల అభివృద్ధిశాఖ…అర్జున్‌ ముండాకు గిరిజన సంక్షేమం కేటాయించారు. ఇక స్మృతి ఇరానీకి స్త్రీ, శిశు సంక్షేమం, జౌళి శాఖ బాధ్యతలు అప్పగించగా…హర్షవర్ధన్‌కు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం…ప్రకాశ్‌ జవదేకర్‌కు పర్యావరణం, అటవీశాఖ, సమాచార, ప్రసార శాఖ మంత్రిత్వ శాఖలను కేటాయించారు.

శివసేన ఎంపీ అరవింద్‌ సావంత్‌కు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ దక్కింది. గిరిరాజ్‌ సింగ్‌కు పాడి, పశుగణాభివృద్ధి, పిషరీస్‌ శాఖలను అప్పగించగా…ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీకి గతంలోలాగే మైనార్టీ సంక్షేమశాఖను కేటాయించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఏకైక కేంద్రమంత్రిగా ఎంపికైన కిషన్‌రెడ్డికి…కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిత్వ శాఖను కేటాయించారు.

Tags

Read MoreRead Less
Next Story