టూత్ పేస్ట్‌తో ఉపయోగాలు ఎన్నో...

టూత్ పేస్ట్‌తో ఉపయోగాలు   ఎన్నో...

టూత్ పేస్ట్ తెల్లగా ఉంటుంది. దంతాలు తోముకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే పొరపాటే.. పేస్ట్ దంతాలు శుభ్రం చేసుకోవడానికే కాదు దాంతో మరెన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి.

  • సెల్ ఫోన్లపై ఉన్న మరకలు ఉంటే నంబర్లు, మెసేజ్ లు సరిగ్గా కనిపించవు. వాటిపై మరకలను తొలగించడానికి టూత్ పేస్ట్ సహయపడుతుంది. ఇంకు మరకలు, జిడ్డు లాంటివి సెల్ ఫోన్ పై ఉంటే, కాస్త టూత్ పేస్టు రాయాలి. ఆ తర్వాత పోడి గుడ్డతో బాగా తుడిచేయాలి.
  • పియానో చేతిలో ఎక్కువగా వాయించడం ద్వారా కీస్ పై మరకలు ఏర్పడతాయి. వాటిని టూత్ పేస్ట్ హెల్ప్ తో పోగొట్టవచ్చు. టూత్ బ్రష్ మీద టూత్ పేస్టుని అప్లై చేసి ఆ బ్రష్ తో పియానో కీస్ ని తుడువాలి ఆ తరువాత తడి వస్త్రంతో రబ్ చేయాలి. దీంతో పియానో నీటిగా కనిపిస్తుంది.
  • ‘తెల్లటి బూట్లపై చిన్న మరక పడినా చూడానికి నీటీగా కనిపించావు. తెల్లటి బూట్లపై పడిన మరకలను శుభ్రం చేయడానికి కూడా టూత్ పేస్టుని ఉపయోగించవచ్చు. వాటిపై కాస్త పేస్టు రాసి ఆ తర్వాత బ్రష్ తో తుడవాలి. కొద్దిసేపటి గాలికి ఉంచిన తర్వాత బూట్లను కడిగితే చాలు, కొత్త బూట్లలా కనిపిస్తాయి.
  • ఫర్నిచర్‌పై టీలు,ఏదైన పండ్ల రసాలు కానీ నీళ్ళు పడి కానీ మరకలు ఏర్పడుతాయి. ఆ మరకలను టూత్ పేస్టుతో పోగొట్టుకోవచ్చు. పొడి గుడ్డను తీసుకుని దానిపై నాన్ జెల్ టూత్ పేస్టుని అప్లై చేసి ఆ వస్త్రంతో ఆ ఫర్నిచర్‌ను తుడవాలి. ఆరిన తర్వాత చూస్తే మరకలు లేకుండా క్లిన్‌గా కనిపిస్తాయి.
  • ఇంట్లో పిల్లలు గోడలపై పెన్సిళ్ళతో కానీ పేన్నులతో కానీ రాస్తుంటారు. ఆ గీతలను పోగోట్టేందుకు టూత్ పేస్ట్ బాగా ఉపయోగపడుతుంది. కాస్త పేస్టుని తీసుకొని వాటిపై రాసి, కొంచెం సేపు అయ్యాక ఓ క్లాత్ తో తుడవాలి దీంతో గోడలు నీటిగా కనిపిస్తాయి.

Tags

Read MoreRead Less
Next Story