Top

సీఎం జగన్‌తో భేటీ అయిన తెలంగాణ IAS అధికారి శ్రీలక్ష్మి

సీఎం జగన్‌తో భేటీ అయిన తెలంగాణ IAS అధికారి శ్రీలక్ష్మి
X

ప్రమాణస్వీకారం తర్వాత ఇక పాలనపై ఫోకస్ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. శనివారం నుంచి శాఖల వారీగా జగన్ వరుస సమీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం ఆర్ధిక, రెవెన్యూ శాఖలపై రివ్యూ నిర్వహించనున్న జగన్..వచ్చే నెల 3న ఉదయం విద్యాశాఖ, మధ్యాహ్నం జలవనరుల శాఖపై సమీక్ష నిర్వహిస్తారు. ఆ మరుసటి రోజు వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించి రివ్యూ చేస్తారు. మధ్యాహ్నం గృహ నిర్మాణ శాఖపై సమీక్షిస్తారు. ఇక వచ్చే నెల 6న సీఆర్డీఏపై రివ్యూ ఉంటుంది.

మరోవైపు సీఎం జగన్‌తో ఉన్నతాధికారులు వరుసగా భేటీ అవుతున్నారు. తాడేపల్లిలోని జగన్‌ నివాసానికి సర్వశిక్ష అభియాన్‌ SPD జె.శ్రీనివాస్‌ చేరుకున్నారు. అటు పంచాయతి ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జవహర్‌ రెడ్డితో పాటు మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ కరికాల వల్లవన్‌, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ మన్మోహన్ సింగ్‌, కమిషనర్‌ ప్రభాకర్‌ జగన్‌తో భేటీ అయ్యారు. అలాగే తెలంగాణ IAS అధికారి శ్రీలక్ష్మి కూడా జగన్ తో సమావేశం అయ్యారు.

*రేపటి నుంచి శాఖల వారిగా సీఎం జగన్‌ సమీక్షలు * శనివారం ఉదయం ఆర్థిక, రెవెన్యూ శాఖలపై జగన్‌ సమీక్ష * వచ్చేనెల 3 న ఉదయం విద్యాశాఖ, మధ్యాహ్నం జలవనరుల శాఖపై… * సీఎం జగన్ సమీక్ష సమావేశాలు * వచ్చే నెల 4 న ఉదయం వ్యవసాయ అనుబంధ రంగాలు.. *మధ్యాహ్నం గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించనున్న జగన్‌ * వచ్చే నెల 6 న సీఆర్డీఏపై సీఎం జగన్‌ సమీక్ష * సీఎం జగన్‌తో వరుసగా భేటీ అవుతున్న ఉన్నతాధికారులు * తాడేపల్లి జగన్‌ నివాసానికి చేరుకున్న సర్వశిక్ష అభియాన్‌ SPD జె.శ్రీనివాస్‌, పంచాయతి ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జవహర్‌ రెడ్డి… మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ కరికాల వల్లవన్‌, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ మన్‌ మోహన్‌ సింగ్‌, కమిషనర్‌ ప్రభాకర్‌, జగన్‌తో భేటీ అయిన తెలంగాణ IAS అధికారి శ్రీలక్ష్మి

Next Story

RELATED STORIES