క్రైమ్

భార్య కాపురానికి రావడం లేదని.. భర్త బ్లేడ్‌తో..

భార్య కాపురానికి రావడం లేదని.. భర్త బ్లేడ్‌తో..
X

పచ్చటి కాపురంలో తాగుడు చిచ్చుపెట్టింది. భర్త ప్రతి రోజు తాగి వచ్చి హింసిస్తుండడంతో భార్య పుట్టింటికి వెళ్లింది. తాగుడు మానేసేదాకా రానని ఆమె తెగేసి చెప్పేసింది. ఇక భార్య కాపురానికి రావడం లేదన్న మనస్థాపంతో భర్త బ్లేడ్‌తో పీక కోసుకుని ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు.

ఏలూరు రూరల్‌ జూలిపూడిలో ముత్యాలు.. చేపల చెరువుపై కాపాల కాస్తుంటాడు. కొంతకాలంగా ముత్యాలుకు అతని భార్య రత్నాలుకు గొడవలు జరుగుతున్నాయి. భర్త తాగి వచ్చి హింసిస్తుండడంతో రత్నాలు ఇద్దరు పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లింది. ఇంటికి రమ్మంటున్నా ఆమె వెళ్లడం లేదు. వీరి పంచాయితీ ఏలూరు మహిళా పోలీస్ స్టేషన కు చేరింది. భర్త వద్దకు వెళ్లననని రత్నాలు మరోసారి స్పష్టం చేసింది. మనస్థాపానికి గురైన ముత్యాలు బ్లేడ్‌ తో గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.

రక్తం మడుగులో ఉన్న ముత్యాలును హుటాహుటిన ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ముత్యాలుకు ఇప్పుడు రత్నాలే దిక్కయింది. ఆయనకు ఆమె సరపర్యలు చేస్తోంది. ప్రస్తుతం ముత్యాలు పరిస్థితి విషమంగానే డాక్టర్లు చెబుతున్నారు.

Next Story

RELATED STORIES