ఆ సర్‌ప్రైజ్‌ ఇప్పటికీ మరిచిపోను.. ఫోన్‌ చేసి చెన్నై రమ్మన్నప్పుడు..

ఆ సర్‌ప్రైజ్‌ ఇప్పటికీ మరిచిపోను.. ఫోన్‌ చేసి చెన్నై రమ్మన్నప్పుడు..
X

అభిమానం, ప్రశంసలు కళాకారులను మరో మెట్టు ఎక్కిస్తాయి. వారి కళా ప్రపంచంలో జరిగిన కొన్ని సంఘటనలు ఓ జ్ఞాపకంగా మిగిలిపోతాయి. తాజాగా ప్రముఖ గాయని స్మిత తన జీవితంలో ఎదురైన ఓ మధురమైన జ్ఞాపకాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఆమె కెరీర్‌ ఆరంభంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి 2002లో తనకు ఇచ్చిన సర్‌ప్రైజ్‌‌ను జ్ఞాపకం చేసుకున్నారు.

"ఓ గాయనిగా నా జీవిత ప్రయాణంలో ఎన్నో మధురమైన గుర్తులు ఉన్నాయి. అందులో జీవితాంతం నిలిచిపోయే సంఘటన ఒకటి ఉంది. ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’లోని ‘నవమల్లిక..’ పాటను పాడటానికి కీరవాణి గారు 2002 అక్టోబరులో నాకు ఫోన్ చేసి చెన్నైకి రమ్మన్నారు. కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్‌లో ఆ పాడటం ఓ అద్భుతమైన అనుభూతి. ఆయన సంగీత సారథ్యంలో ఇప్పటివరకు చాలా పాటలు పాడాను. ఫిల్మ్‌ఫేర్‌ లాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డులను గెలుచుకున్నాను".అంటూ స్మిత ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టారు.

స్మిత పాప్ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ తన సంగీత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. మసక మసక చీకటిలో.. మల్లెతోట వెనకాల అంటూ రీమిక్స్ సాంగ్ తో పాప్ సింగర్‌గా స్మిత శ్రోతలకు బాగా దగ్గరైంది . కొద్దీ రోజుల వరకు పాటలతో, ప్రైవేట్ ఆల్బమ్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈమె రూట్ మార్చి ఇప్పుడు భక్తి పాటలను ఎంచుకుంది.

Next Story

RELATED STORIES