నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ-2019 డ్రాఫ్ట్ పై రాజుకుంటున్న నిప్పు

నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ-2019 డ్రాఫ్ట్ పై రాజుకుంటున్న నిప్పు

నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ-2019 డ్రాఫ్ట్ పై నిప్పు రాజుకుంది. ట‌్రై లాంగ్వేజ్ పాలసీపై తమిళనాడు భగ్గుమంటోంది. హిందీని బలవంతంగా తమపై రుద్దొద్దని మండిపడుతోంది. కొత్త పాలసీ ప్రకారం విద్యార్థులకు ౩ భాషలు భోదించాల్సి ఉంటుంది. మాతృభాషతోపాటు ఇంగ్లిష్, హిందీ కూడా ఉంటాయి. 8 వ తరగతి వరకు ఈ త్రిభాష పద్ధతిని అమలు చేయాలని నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ డ్రాఫ్ట్ సూచించింది. కస్తూరి రంగన్ నేతృత్వంలోని కమిటీ ఈ కొత్త డ్రాఫ్ట్ పాలసీని శుక్రవారం కేంద్రానికి అందించింది.

దీనిపై తమిళనాట పెద్ద ఎత్తున ఆందోళనలు సాగుతున్నాయి.. ఈ ట్రైలాంగ్వేజ్ పాలసీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపేన్ నిర్వహిస్తున్నారు. అటు తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ పాలసీని తోసిపుచ్చింది. తాము టూ లాంగ్వేజ్ పాలసీనే పాటిస్తామని స్పష్టం చేసింది.ఈ వివాదం మరింత ముదరడంతో..కేంద్రం స్పందించింది. ఏ భాషను ఎవరిపైనా బలవంతంగా రుద్దే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసింది. కస్తూరి రంగన్ కమిటీ సమర్పించిన డ్రాఫ్ట్ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరణ ఇచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story