కాంగ్రెస్ పార్టీ సమావేశంలో కీలక నిర్ణయం.. పార్లమెంటరీ పార్టీ నేతగా..

కాంగ్రెస్ పార్టీ సమావేశంలో కీలక నిర్ణయం.. పార్లమెంటరీ పార్టీ నేతగా..
X

ఢిల్లీలో జరుగుతున్న కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సోనియాగాంధీని తమ నాయకురాలిగా ఆ పార్టీ ఎంపీలు ఎన్నుకున్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సోనియా పేరు ప్రతిపాదించగా.. మిగిలిన వారంతా సమర్థించారు.

పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమికి తీవ్రంగా మదన పడుతున్నారు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ. తాను అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని చెప్పారు. ఆమేరకు భీష్మించుకుని కూర్చున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియాగాంధీ ఎన్నికవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Next Story

RELATED STORIES