క్రైమ్

మతిస్థిమితం లేని మహిళపై ఇద్దరు కామాంధులు..

మతిస్థిమితం లేని మహిళపై ఇద్దరు కామాంధులు..
X

ఆమె మతిస్థిమితం లేని వికలాంగురాలు.. భిక్షాటన చేస్తూ కడుపునింపుకునే మహిళపై ఇద్దరు కామాంధులు కన్నేశారు. రాత్రి ఒంటరిగా ఉన్న ఆమెను లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణమైన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్‌లో చోటు చేసుకుంది.

మతిస్థిమితం లేని బాధిత మహిళ.. రోడ్డు పక్కన భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగించేది. శనివారం రాత్రి ఇద్దరు యువకులు మద్యం మత్తులో వికలాంగురాలిని పక్కనే ఉన్న వర్క్‌షాప్‌లోకి బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గమనించి.. ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. అపస్మారకస్థితిలో పడి ఉన్న మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Next Story

RELATED STORIES