టిక్‌టాక్ కారణంగా భార్యని కడతేర్చిన భర్త

టిక్‌టాక్ కారణంగా భర్త తన భార్యను కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. కోవై ప్రాంతం అరివొలినగర్‌కు చెందిన కనకరాజ్ (35)కు అదే ప్రాంతానికి చెందిన నందిని (28)తో నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. కనకరాజ్ భవన నిర్మాణ కార్మికుడు. నందిని కోవై సమీపంలో ని ఓ ప్రైవేటు ఇంజినీరింగు కళాశాలలో అటెండర్ గా పని చేస్తుంది. వీరికి ఓ కుమారుడు, ఓ కుమార్తె సంతానం. ఏడాదిన్నర నుంచి దంపతుల మధ్య తగాదాలు వస్తున్నాయి. దాంతో నందిని తన పుట్టింటికి వెళ్ళింది. ఈ క్రమంలో నందిని కొన్నినెలలుగా టిక్‌టాక్ బానిసైంది. అధిక సంఖ్యలో వీడియోలు అప్‌లోడ్ చేసింది. అయితే నందిని టిక్ టాక్ చెయ్యడం ఇష్టం కనకరాజ్ కు ఇష్టం లేదు.
దాంతో ఆమెను టిక్ టాక్ మానెయ్యాలని హెచ్చరించాడు. అయినా ఆమె వినలేదు.. గురువారం కనకరాజ్ నందినికి ఫోన్ చేసి టిక్‌టాక్ యాప్‌లో వీడియోలను అప్‌లోడ్ చెయ్యవద్దని, ఇంటికి రావాలని కోరాడు. దానికి నందిని ససేమీరా రానని చెప్పింది. దీనిపై పలుమార్లు నందినికి ఫోన్ చెయ్యడంతో ఆ సమయంలో ఫోన్ బిజీ వచ్చింది. కోపోద్రిక్తుడైన కనకరాజు శుక్రవారం మధ్యాహ్నం కనకరాజ్ మద్యం సేవించి, నందిని పని చేస్తున్న కళాశాలకి వచ్చి ఆమెతో గొడవపడ్డాడు. కోపంతో తన వెంట తెచ్చుకున్నకత్తిని తీసి నందినిని అతి దారుణంగా హత్య చేశాడు. విగతజీవిగా పడివున్ననందినిని ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడికోసం గాలిస్తున్నారు.
RELATED STORIES
Prabhas: మరోసారి తెరపై రీల్ కపుల్.. అయిదేళ్ల తర్వాత జోడీగా..
17 May 2022 11:15 AM GMTLata Bhagwan Kare: 68 ఏళ్ల వయసులో భర్త కోసం మారథాన్.. ఆమె జీవితం ఓ...
17 May 2022 11:00 AM GMTAriyana Glory: నవంబర్‌లో బిగ్ బాస్ అరియానా పెళ్లి.. కొత్త ఇంట్లో...
17 May 2022 10:15 AM GMTKamal Haasan: జాతీయ భాషా వివాదంపై స్పందించిన కమల్.. మాతృభాషకు...
17 May 2022 9:41 AM GMTKajal Aggarwal: కొడుకుతో కాజల్.. క్యూట్ ఫోటోస్
17 May 2022 8:15 AM GMTHappy Birthday Charmy Kaur : టీనేజ్ లోనే వెండితెర పై హవా
17 May 2022 7:45 AM GMT