Top

విశాఖ దుర్ఘటనలో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమం

విశాఖ దుర్ఘటనలో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమం
X

విద్యుత్ స్థంబానికి ఆటో ఢీకొన్న దుర్ఘటనలో తీవ్ర గాయాలతో ముగ్గురు చిన్నారులు కేజీహెచ్‌ బర్నింగ్‌ ఐసీయూ వార్డులో చికిత్స పొంతున్నారు. ఏడాదిన్నార వయస్సున్న జె.వికాస్, నాలుగేళ్ల వి.దావీదు, ఐదేళ్ల జెన్నిబాబుల పరిస్థితి విషమంగానే ఉంది. 48 గంటలు గడిస్తే తప్ప వారి పరిస్థితి చెప్పలేమని వైద్యులు అంటున్నారు. వికాస్ తండ్రి సంఘటనా స్థలంలోనే మృతి చెందగా పొరుగింటివారు ఆ బాలుడ్ని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. చిన్నారుల పరిస్థితి విషయంగా ఉండడంతో బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

Next Story

RELATED STORIES