సైకిల్‌‌పై వెళ్లి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన..

సైకిల్‌‌పై వెళ్లి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన..

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా డాక్టర్ హర్షవర్ధన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ప్రజారోగ్యంపై అవగాహన పెంచేలా సాగింది. తన నివాసం నుంచి ఆరోగ్యశాఖ కార్యాలయానికి ఆయన సైకిల్ పై వెళ్లారు. సైకిల్ పర్యావరణానికి, ఆరోగ్యానికి మేలు చేస్తుందని ప్రజలకు సందేశం ఇస్తూ.. మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆరోగ్య రంగంలో ప్రధాని మోదీ ధృక్పథాన్నిముందుకు తీసుకెళ్తానని, ఆరోగ్యకర భారతావని కోసం అన్ని చర్యలు చేపడతామని హర్షవర్ధన్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకర జీవనశైలిని అలవరచుకునేలా అవగాహన కల్పిస్తామని మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు ప్రజలందరికీ చేరేలా చూస్తామని హామీ ఇచ్చారు. జూన్ 3ను ప్రపంచ సైకిల్ దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. దీన్ని తెలిపేందుకే హర్షవర్ధన్ సైకిల్ పై వచ్చి బాధ్యతలు స్వీకరించారు. సైకిల్ అందరికీ అందుబాటు ఉండే రవాణా సాధనమని, ఆరోగ్యకరమైనదని మంత్రి చెప్పారు.

Read MoreRead Less
Next Story