మహిళను కాళ్లతో తన్ని అవమానించిన ఎమ్మెల్యే

X
TV5 Telugu3 Jun 2019 7:02 AM GMT
నీటి సమస్య తీర్చమని స్థానిక ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేయడానికి వెళ్లిన మహిళతో బీజేపీ నేతలు దారుణంగా ప్రవర్తించారు. అహ్మదాబాద్ లోని నరోదా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే బలరామ్ వద్దకు ఓ మహిళ నీటి సమస్యపై కలిసేందుకు వెళ్లింది. అక్కడున్న బీజేపీ నేతలు ఆమెను కిందపడేసి కొట్టారు. ఇక ఎమ్మెల్యే బలరామ్ కూడా తానేమీ తక్కువ కాదన్నట్టు నిస్సిగ్గుగా మహిళను కాలితో తన్నాడు.
ఎమ్మెల్యే మహిళను కాలితో తన్నిన వీడియో వైరల్ అయింది. ఎమ్మెల్యే చర్యపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఎమ్మెల్యే బలరామ్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఆ మహిళకు క్షమాపణలు చెప్తా అన్నారు. గతంలో బలరామ్.. నరోద ప్రాంత కార్పొరేటర్ గా పనిచేశారు.
Next Story