ఈ వయసులో ఓల్డేజ్ హోమ్‌లో పెడతావా అంటూ కొడుకుని..

ఈ వయసులో ఓల్డేజ్ హోమ్‌లో పెడతావా అంటూ కొడుకుని..

తన పని తాను చేసుకోలేదు. పోనీ అమ్మకోసం తనేమైనా చేయగలడా అంటే అదీ లేదు. అందుకే 92 ఏళ్ల తల్లిని తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పెడతానన్నాడు 72 ఏళ్ల కొడుకు. దానికి ఆగ్రహించిన ఆ తల్లి కొడుకుని తుపాకీ తీసుకుని నిలువునా కాల్చి పారేసింది. అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో నివాసం ఉంటున్న అన్నా మే బ్లెస్సింగ్ అనే 92 ఏళ్ల వృద్ధురాలు తన కొడుకు థామస్‌తో కలిసి నివసిస్తోంది. అయితే కొన్నాళ్లుగా అమ్మ బ్లెస్సింగ్ ఆరోగ్య పరిస్థితి అస్సలు బాలేదు. కొడుకు థామస్‌కి అమ్మని చూసుకోవడం కష్టంగా మారింది. దాంతో ఆమెని హోమ్‌లో జాయిన్ చేస్తానన్నాడు. వెళ్లడం ఇష్టంలేని బ్లెస్సింగ్ కొడుక్కి అదే విషయాన్ని చెప్పింది.

చేసే వారు ఎవరూ లేరు హోమ్‌కి తీసుకెళ్లడం తప్ప వేరే మార్గం లేదని ఖచ్చితంగా చెప్పాడు తల్లికి. అందుకు ససేమిరా అన్న తల్లి ఈ వయసులో నన్ను ఇబ్బంది పెడతావా. కావాలంటే నువ్వెళ్లు. నేను మాత్రం ఇక్కడే ఉంటా అని ఖరాఖండిగా చెప్పింది. దానికి కొడుకు ఏమీ వినిపించుకోనట్లే ఉండిపోయాడు. దాంతో చిర్రెత్తుకొచ్చిన తల్లి మూలన ఉన్న తుపాకీ తీసి కొడుకు మీద పెట్టి నొక్కింది. అంతే కొడుకు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న కొడుకు ప్రియురాలిని కూడా చంపేస్తానని బెదిరించింది. దీంతో భయాంతోళనకు గురైన ఆమె బయటకు పరిగెట్టి చుట్టు పక్కల వారిని పిలిచింది. సమాచారం అందుకున్న పోలీసులు బ్లెస్సింగ్‌ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story