విదేశీ పర్యటనకు వెళ్లనున్న చంద్రబాబు!

పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. పార్టీ బలోపేతం, తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో చర్చించారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో పార్టీ ఘోర పరాజయంపాలైన నేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచి పార్టీని ఎలా ప్రక్షాళన చేయాలి? నూతన నాయకత్వాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి? ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నెల 7 నుంచి చంద్రబాబు కొద్ది రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈలోగా పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, తదితర అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఈ భేటీకి పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, చినరాజప్ప, కళా వెంకట్రావు, సోమిరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని హాజరయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com