వారి త్యాగం మరువలేనిది.. సియాచిన్లో 11 వందల మంది సైనికుల మరణం

వారి త్యాగం మరువలేనిది.. సియాచిన్లో  11 వందల మంది సైనికుల మరణం

అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన AN-32 విమానం అదృశ్యమైంది. టేకాఫ్‌ అయిన కాసేపటికే విమానంతో సంబంధాలు తెగిపోయాయి. వెంటనే రంగంలోకి దిగిన వైమానిక సిబ్బంది..గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. విమాన ప్రమాదంపై ఆరా తీశారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.

అరుణాచల్‌ ప్రదేశ్‌లో AN‌ -32 విమానం గల్లంతైంది. అసోంలోని జోర్‌హాట్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి సోమవారం మధ్యాహ్నం 12.24కు బయలుదేరిన విమానం… అరుణాచల్‌ ప్రదేశ్‌లోని మెన్‌చుకా వైమానిక స్థావరానికి చేరుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో గాలిలోకి ఎగిరిన 35 నిమిషాల తర్వాత విమానంతో గ్రౌండ్‌ సిబ్బందికి సంబంధాలు తెగిపోయాయి. విమానం ఆచూకీ లేకుండా పోయింది. విమానంలో సిబ్బందితో సహా మొత్తం 13 మంది ప్రయాణికులు ఉన్నారు.స్పాట్‌…

వెంటనే అప్రమత్తమైన ఎయిర్‌ఫోర్స్‌ గాలింపు చర్యలు చేపట్టింది. ఇందు కోసం సుఖోయి-30 యుద్ధ విమానంతో పాటు సీ-130 ప్రత్యేక ఎయిర్‌క్రాఫ్ట్‌ను కూడా రంగంలోకి దింపారు. విమానం ప్రమాదానికి గురైందని నిర్థారించిన అధికారులు.. శకలాలను అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్ సియాంగ్ జిల్లాలోని టాటోకు సమీపంలో విమాన శిథిలాలను గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపైఇంత వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

మరోవైపు విమానం అదృశ్యంపై స్పందించారు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్ . గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని..అందరు క్షేమంగా బయటపడాలని కోరుకుంటున్నానని ట్వీట్‌ చేశారు.జమ్మూ కశ్మీర్‌లోని సియాచిన్ గ్లేసియర్‌లో పర్యటించారు రాజ్‌నాథ్‌. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులతో కాసేపు ముచ్చటించారు. జవాన్లకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.ః

సియాచిన్ పర్యటనలో వీర సైనికులకు రాజ్‌నాథ్ ఘన నివాళి అర్పించారు. సియాచిన్ గ్లేసియ‌ర్‌లో విధులు నిర్వహిస్తూ సుమారు 11 వందల మంది సైనికులు మ‌ర‌ణించారు. ఆ అమ‌ర‌వీరుల సేవ‌ల‌ు, త్యాగాల‌ను రాజ్‌నాథ్ కొనియాడారు. అమర జవాన్లకు జాతి రుణ‌ప‌డి ఉంద‌న్నారు.

Tags

Read MoreRead Less
Next Story