తాజా వార్తలు

చేపమందు ప్రసాదంపై మరోసారి వివాదం

చేపమందు ప్రసాదంపై మరోసారి వివాదం
X

చేపమందు ప్రసాదంపై మరోసారి వివాదం రాజుకుంది. ప్రసాదం పంపిణీ అడ్డుకోవాలంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. బాలల హక్కుల సంఘం ఈ పిటీషన్ ను దాఖలు చేసింది. చేపమందు తయారీకి ఎలాంటి శాస్త్రీయత లేదన్నది పిటీషనర్ వాదన. సైంటిఫిక్ అథారిటీ లేకుండా చేపమందు ప్రసాదం పంపిణీ చేయటం చట్టవిరుద్ధమే అవుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రసాదం పంపిణీ కోసం ప్రభుత్వం ప్రతీ ఏటా అనవసరంగా కోట్ల రుపాలయను వృద్ధా చేస్తుందని అభిప్రాయపడ్డారు పిటీషనర్.

అస్తమా, ఉబ్బసం వ్యాధులను నయం చేసేందుకు ప్రతీ ఏటా మృగశిర కార్తే సమయంలో బత్తిన సోదరులు చేపమందు ప్రసాదం పంపిణీ చేస్తారు. ఈ నెల 8, 9న ప్రసాదం పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రసాదం కోసం కావాల్సిన చేప పిల్లల్ని ప్రభుత్వమే అందిస్తుంది. అయితే..చేపమందు ఫార్ములా ఎంటో చెప్పాలని..లేదంటే శాస్త్రీయత లేని మందును అడ్డుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలవటం ప్రధాన్యత సంతరించుకుంది.

Next Story

RELATED STORIES