ఏపీలో భారీగా ఐఎఎస్ అధికారుల బదిలీలు

ఏపీలో పెద్దసంఖ్యలో IAS అధికారుల బదిలీలు జరిగాయి. 9 జిల్లాల కలెక్టర్లకూ స్థానచలనం కలిగింది. సీఆర్డీఏ కమిషనర్‌గా లక్ష్మీనరసింహంను నియమించారు. వైద్య ఆరోగ్య శాఖపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్న ముఖ్యమంత్రి జగన్.. అక్కడ జవహర్‌రెడ్డిని నియమించారు. అక్కడ పనిచేస్తున్న పూనం మాలకొండయ్యను వ్యవసాయ శాఖకు బదిలీ చేశారు. అజయ్ జైన్, విజయానంద్, అనురాధలకు పోస్టింగ్ ఇవ్వలేదు. వారిని GADలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్న కోన శశిధర్‌ను పౌర సరఫరాల శాఖకు బదిలీ చేశారు. కొత్త కలెక్టర్‌గా శామ్యూల్ ఆనంద్‌ను నియమించారు. ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా పి.భాస్కర్, నెల్లూరుకు శేషగిరిబాబును నియమించారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా ముత్యాల రాజు, తూర్పు గోదావరి జిల్లాకు మురళీధర్ రెడ్డి నియమితులయ్యారు. కర్నూలు కలెక్టర్‌గా వీరపాండ్యన్‌కు, అనంతపురం కలెక్టర్‌గా ఎస్.సత్యనారాయణకు పోస్టింగ్ ఇచ్చారు. ఇక, చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ప్రద్యుమ్నను మార్కెటింగ్ శాఖకు బదిలీ చేయగా.. ఆయన స్థానంలో నారాయణ భరత్ గుప్తాకు అవకాశం కల్పించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com