ఫ్లైట్ వదిలి పాలిటిక్స్ లోకి.. ఎంపీటీసీగా ఘన విజయం

అతనో పైలట్. అమెరికాలోని ఓ ప్రముఖ ఎయిర్ లైన్స్ లో ఉద్యోగం. లక్షల్లో జీతం. అయినా..అవన్ని వదిలేసి ప్రజాసేవ కోసం సొంతూరుకు వచ్చాడు. పరిషత్ ఎన్నికల్లో ఎంపీటీసీగా నిలబడి ఘనవిజయం సాధించాడు. ఇక పైలట్ ఉద్యోగం, అమెరికా జీవితం వదిలేసి ప్రజాసేవకు అంకింతం అవుతానంటున్నాడు గుర్రం ఆనంద్ రెడ్డి.
దివంగత టీడీపీ సీనియర్ నేత గుర్రం వెంకట్ రెడ్డి రెండో కుమారుడే గుర్రం ఆనంద్ రెడ్డి. శంషాబాద్ మండలంలోని శంకరాపురం ఆనంద్ రెడ్డి సొంతూరు. అమెరికాలో ఉన్నత చదువులు పూర్తి అక్కడే పైలట్ గా శిక్షణ తీసుకున్నాడు. ఉద్యోగం రావటంతో అమెరికాలో ఉండిపోయాడు. అయితే..తండ్రి మరణంతో సొంత గ్రామానికి తిరిగొచ్చిన ఆనంద్ రెడ్డి..శంషాబాద్ మండలం చిన్నగోల్కండ ఎంపీటీసీ స్థానానికి కాంగ్రెస్ తరపున పోటీ చేశాడు. 676 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించాడు. అమెరికా నుంచి వచ్చిన తన సోదరుడికి విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపాడు ఆనంద్ రెడ్డి బ్రదర్ గుర్రం రణధీర్ రెడ్డి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com