పరిషత్ ఎన్నికలు.. కొన్ని జిల్లాల్లో ఆ రెండు పార్టీలు ఒక్క సీటు కూడా సాధించలేదు

పరిషత్ ఎన్నికలు.. కొన్ని జిల్లాల్లో ఆ రెండు పార్టీలు ఒక్క సీటు కూడా సాధించలేదు

పరిషత్ ఎన్నికల్లోనూ అసెంబ్లీ రిజల్ట్స్ తరహాలోనే దుమ్మురేపింది టీఆర్ఎస్. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో కారు స్పీడుకు వార్ వన్ సైడ్ అయ్యింది. 32కు 32 జడ్పీ పీఠాలు గంపగుత్తగా టీఆర్ఎస్ వశం అయ్యాయి. అటు మండల పరిషత్ లో కూడా టీఆర్ఎస్ కు ఎదురులేకుండా పోయింది. దాదాపు 500కుపైగా మండల పరిషత్ లు కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ ప్రభంజనం ముందు కాంగ్రెస్, బీజేపీ ఎక్కడా ప్రభావం చేపించలేకపోయాయి. కొన్ని జిల్లాల్లో కనీసం ఒక్క సీటు కూడా సాధించలేదు ఆ రెండు పార్టీలు.

మొత్తం 538 జడ్పీటీసీల్లో 443 జడ్పీటీసీలు టీఆర్ఎస్ గెలుచుకుంది. కాంగ్రెస్-75, బీజేపీ-7 జడ్పీటీసీలను దక్కించుకున్నాయి. ఇక 5817 ఎంపీటీసీట్లో టీఆర్ఎస్- 3, 557, కాంగ్రెస్ - 1377, బీజేపీ - 211 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకున్నాయి. 597 ఎంపీటీసీలను స్వతంత్రులు కైవసం చేసుకున్నారు. టీఆర్ఎస్ వేవ్ లో కొన్ని జిల్లాలో ఫలితాలు క్లీన్ స్వీప్ అయ్యాయి. కరీంనగర్, జగగామ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, పాలమూరులో టీఆర్ఎస్ మొత్తం సీట్లను తుడిచి పెట్టేసింది. టీఆర్ఎస్ వేవ్ లో మహబూబ్‌నగర్, కరీంనగర్,వరంగల్ రూరల్,ఆర్బన్,గద్వాలలో కాంగ్రెస్ ఒక్క జెడ్పీటీసీ సీటు కూడా గెలవలేకపోయింది. బీజేపీ 29 జిల్లాల్లో ఒక్క జడ్పీటీసీ సీటు కూడా గెలుచుకోలేకపోయింది. 9 జిల్లాల్లో ఒక్క ఎంపీటీసీ స్థానం కూడా దక్కలేదు.

రాష్ట్రవ్యాప్తంగా గులాబీ వెల్లివిరిసినా..బీజేపీకి కూడా కొద్ది మేరా ఆశజనకమైన ఫలితాలు సాధించింది. ఆదిలాబాద్, నారాయణపేట, నిజామాబాద్ లో ఎంపీటీసీల సంఖ్యను పెంచుకుంది కమలం పార్టీ. ఇక టీడీపీ, లెఫ్ట్ నామమాత్ర పాత్రనే పోషించాయి. టీడీపీకి మొత్తం 21 ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించింది. భద్రాద్రి కొత్తగూడెంలో అత్యధికంగా 11 ఎంపీటీసీలను గెలుచుకుంది.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ నాయకత్వం..కేసీఆర్ ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసం పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కుఓట్ల వర్షం కురిపించింది. పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడుకు మూడు సీట్లను సాధించిన టీఆర్ఎస్...ఇప్పుడు ప్రజల నుంచి నేరుగా ఎంపీటీసీ, జడ్పీటీసీలను గెలిపించుకొని క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ కు ఉన్న ఆదరణను మరోసారి చాటిచెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story