తమ్మినేని వీరభద్రం సొంతూరులో తొలిసారి సీపీఎం ఓటమి

తమ్మినేని వీరభద్రం సొంతూరులో తొలిసారి సీపీఎం ఓటమి

ప్రాదేశిక ఎన్నికల్లో కారు టాప్‌గేరులో పరుగులు పెడుతోంది. ట్రెడ్స్ చూస్తే 75 శాతానికిపైగా ఎంపీటీసీలు TRS ఖాతాలోనే పడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 50కిపైగా మండలాల్లో క్వీన్‌స్వీప్ చేయడం చూస్తుంటే.. ఈ జోరు కొనసాగేలాగే ఉంది. సిద్దిపేట లాంటి చోట్లయితే.. TRSకి ఎదురే లేకుండా పోయింది. ఇక.. దాదాపు వెయ్యి ఎంపీటీసీలు గెలిచినా పదవుల రేసులో కాంగ్రెస్‌కి నిరాశ తప్పేలా కనిపించడం లేదు.

ఇక.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సొంతూరు తెల్దార్‌పల్లిలో తొలిసారి సీపీఎం ఓటమి పాలయ్యింది. ఇన్నాళ్లూ ఏకగ్రీవంగా ప్రాదేశిక ఎన్నికలు జరిగినా ఈసారి ఈ తీర్మానాలను వ్యతిరేకిస్తూ పోటీకి దిగడంతో ఎన్నికలు అనివార్యమైంది. చివరికి TRS అభ్యర్థి బలపరిచిన ఇండిపెండెంట్ కృష్ణయ్య MPTCగా గెలుపొందారు.

నిజామాబాద్ జిల్లా ఆర్మూరు(మం) పిప్రీలో ఫలితం ఉత్కంఠ రేపింది. కౌంటింగ్‌లో ముందు టీఆర్ఎస్ అభ్యర్థి 2 ఓట్ల తేడాతో విజయం సాధించినట్టు చెప్పారు. ఐతే.. ప్రత్యర్థులు రీకౌంటింగ్‌కు పట్టుబట్టడంతో తిరిగి ఓట్లు లెక్కించారు. అప్పుడు ఇద్దరికీ సమానంగా 690 ఓట్లు వచ్చాయి. చివరికి లాటరీలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించినట్టు ప్రకటించారు. ఒక్క ఓటు కూడా ఎంత కీలకమో చెప్పేందుకు ఈ ఫలితాన్ని ఇప్పుడు ఉదాహరణగా చెప్పొచ్చు.

ఇక, రెండు ఓట్లు, నాలుగు ఓట్లు తేడాతో అభ్యర్థుల తలరాతలు మారిపోయిన ఘటనలు కూడా ఈసారి చాలానే ఉన్నాయి. కొత్తగూడెంలోని అన్నపురెడ్డి మండలంలోని పెట్లంలో 4 ఓట్లతో కాంగ్రెస్ ఎంపీటీసీ విజయం సాధించారు.

మునగాల మండలం నారాయణగూడెంలో 13 ఓట్ల తేడాతో సీపీఎం గెలిచింది. ఇక అటు.. మండలాధ్యక్ష పదవులు దక్కించుకోవడంలో కీలకంగా మారిన ఇండిపెండెంట్ల కోసం ప్రలోభాల పర్వాలు కూడా మొదలయ్యాయి. నిజామాబాద్‌లో ఏకంగా బీజేపీ అభ్యర్థినే తమవైపు తిప్పుకునేందుకు ట్రై చేశారు TRS నేతలు. నిజామాబాద్ జిల్లా మక్లూర్‌(మం) గొట్టుముక్కలలో బీజేపీ ఎంపీటీసీ సత్తెమ్మను తమ క్యాప్‌కు తరలించేందుకు టీఆర్ఎస్ చేసిన ప్రయత్నాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత కూడా కనిపించింది.

Tags

Read MoreRead Less
Next Story