తాజా వార్తలు

వాళ్లలా చేస్తారని అనుకోలేదు: నటి ఇంద్రజ

వాళ్లలా చేస్తారని అనుకోలేదు: నటి ఇంద్రజ
X

తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగిన తార ఇంద్రజ. సినిమాలకు దూరంగా ఉన్నా అడపాదడపా చిన్న చిన్న పాత్రల్లో తళుక్కున్న మెరుస్తుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. ఈ జాడ్యం ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు అన్ని చోట్లా ఉంది. అమ్మాయిలు ఇంటి నుంచి బయటకు అడుగు పెడుతున్నప్పుడే ఆలోచించుకోవాలి. ఎక్కడికి వెళుతున్నాము. అక్కడ ఎలా ఉండాలి. ఎలాంటి వాళ్లు ఉంటే ఎలా ఫేస్ చేయ్యాలి అనేది స్పష్టమైన అవగాహనతో ఉండాలి. అంతేకానీ అవకాశాల కోసమో.. మరి దేనికోసమో మీ వ్యక్తిత్వాన్ని చంపుకోకూడదు. మీ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉండాలి. మీ ఆత్మస్థైర్యమే మిమ్మల్ని నలుగురిలో ఒకరిగా కాకుండా స్పెషల్‌గా గుర్తింపు తెచ్చిపెడుతుంది. ఒకటి మిస్సైనా మరొకటి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. లేకపోతే ఆ తరువాత తీరిగ్గా అప్పుడలా చేసి ఉండవలసింది కాదు అని బాధపడాల్సి వస్తుంది అని ఇంద్రజ చెప్పుకొచ్చింది.

ఇక తను నటించిన ఓ సినిమా గురించి ప్రస్తావిస్తూ 'దిక్కులు చూడకు రామయ్య' చిత్రంలో ప్రీ క్లైమాక్స్ చాలా బాగా యాక్ట్ చేసిందట. ప్రివ్యూ చూసినప్పుడు ఆ సీన్ లేదు. ఎందుకు కట్ చేశారు అని అడగాలని కూడా అనుకోలేదు. అడిగితే చిత్ర నిడివి కారణమంటారు. అందుకే ఏ విషయంలోను ఎవరినీ తప్పు పట్టే అలవాటు నాకు లేదు. కానీ అంత మంచి సీన్‌ని వాళ్లలా కట్ చేస్తారని అనుకోలేదు. అందుకు కొంచెం బాధపడ్డాను. కానీ ఇలాంటివి అన్నీ మామూలే అని సర్ధుకుపోయానంటూ ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంది ఇంద్రజ.

Next Story

RELATED STORIES