Top

నిజ్జంగా నిజం.. ఇది నోరు కాదు.. మరేంటి..!! వీడియో వైరల్

నిజ్జంగా నిజం.. ఇది నోరు కాదు.. మరేంటి..!! వీడియో వైరల్
X

ఇదేంటి.. నోట్లో పళ్లకంటే కాయిన్సే ఎక్కువున్నాయి. అన్నం బదులు కాయిన్స్‌తో కడుపునింపుకుంటాడా ఏంటి. మింగీ మింగీ ఏదో తేడా చేసినట్టుంది. అందుకే తిరగేసి ఒక్కటిచ్చి మొత్తం కక్కిస్తున్నట్టున్నారు. అయినా శుబ్బరంగా అన్నం తినాలనిపించకపోతే ఏదో ఒక గడ్డి మార్కెట్లో దొరుకుతుంది. బోలెడు బేకరీ ఐటెంస్ ఉండనే ఉన్నాయి. మరి ఈ కాయిన్స్ తినే అలవాటేంటో అని అనిపిస్తోంది కదూ ఈ ఫోటోలు చూస్తుంటే. అక్కడే పర్సులో కాలేస్తున్నారు అందరూ.. అచ్చంగా మనిషి నోరులా కనిపిస్తున్న ఈ పర్సుని జపాన్‌కి చెందిన మ్యూజిక్ కంపోజర్, ఆర్టిస్ట్ డూ డిజైన్ చేశారు. ఈ పర్సుని తెరవాలంటే దాని నోరు తెరవాల్సిందే.

దీన్ని తయారు చేసి వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని చూసిన నెటిజన్స్ నోరెళ్ల బెడుతున్నారు. వావ్.. వాటే క్రియేటివిటీ అంటూ మెచ్చుకుంటున్నారు. ఎలా తయారు చేశారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆ ఒక్కటీ అడక్కండి అంటూ ప్రశ్నలను దాటవేస్తున్నారు డూ. పోనీ రేటైనా చెప్పండి.. ఎంతైనా కొంటాం అని అడిగేవాళ్లూ లేకపోలేదు. ప్రస్తుతానికైతే తానేమి దీన్ని మార్కెట్ చేయాలనుకోవట్లేదని అంటున్నారు. మరి డిమాండ్ పెరిగితే డూ ఆలోచన మారుతుందేమో.

View this post on Instagram

人肉小銭入れ作りました

A post shared by doooo (@doooo_cds) on

Next Story

RELATED STORIES