విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డికి కీలక బాధ్యతలు.. ప్రొటెం స్పీకర్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే?

X
వైసీపీ పార్లమెంటరీ నేతగా విజయసాయిరెడ్డి పేరు ఖరారు చేశారు ముఖ్యమంత్రి జగన్. లోక్‌సభలో వైసీపీపక్ష నేతగా రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి అవకాశం ఇచ్చారు. చీఫ్ విప్‌గా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ను నియమించారు. అటు, ఏపీ మంత్రివర్గం, అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికపైనా జగన్ కసరత్తు పూర్తి కావచ్చింది. అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చిన్న అప్పలనాయుడు ఉంటారని తెలుస్తోంది. ప్రొటెం స్పీకర్ రేసులో కొందరు సీనియర్ ఎమ్మల్యేల పేర్లు తెరపైకి వచ్చినా.. చివరికి అప్పలనాయుడు పేరునే ముఖ్యమంత్రి ఓకే చేస్తారని అంటున్నారు. ఈనెల 12 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
