ఎల్‌ఐసి కార్యాలయంలో ఘరానా మోసం

ఎల్‌ఐసి కార్యాలయంలో ఘరానా మోసం

సూర్యాపేట జిల్లా కోదాడ LIC కార్యాలయంలో ఘరానా మోసం వెలుగుచూసింది. 190 మంది పాలసీదార్లు చనిపోయినట్లుగా తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి.. 3 కోట్ల 14 లక్షల రూపాయలు కొల్లగొట్టేశారు మోసగాళ్లు. పాలసీ కట్టలేనివారి బాండ్లు కలెక్ట్‌ చేసి తప్పుడు మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించి వాటి ద్వారా క్లెయిమ్‌లు పొందారు.

ఆరేళ్లుగా సాగుతున్న ఈ నకిలీ క్లెయిముల దందా.. LIC అంతర్గత తనిఖీల్లో వెలుగుచూసింది. ప్రధాన నిందితుడు బానోత్‌ భికు నాయక్‌తో పాటు.. గుమస్తా హరియా.. మరో తొమ్మిది మంది LIC ఏజెంట్లను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడు భికునాయక్‌.. ఏకంగా బతికున్న తన తండ్రి పేరుమీదే తప్పుడు మరణ ధృవీకరణ పత్రం సృష్టించి క్లెయిమ్‌ పొందాడని అధికారులు గుర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story