తాజా వార్తలు

సంగారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం

సంగారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం
X

సంగారెడ్డి జిల్లా జిన్నారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గడ్డపోతారంలోని స్పార్‌ ల్యాబ్‌ పరిశ్రమలోని సాల్వెంట్‌ రికవరీ తయారుచేసే యూనిట్‌లో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పక్క పరిశ్రమలకు వ్యాపించాయి. కెమికల్స్‌పై నీళ్లు పడడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. మంటలు ఆర్పేందుకు రెండు ఫైరింజన్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

Next Story

RELATED STORIES