రంజాన్ వేడుకల్లో అపశ్రుతి.. విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్..

X
నిజామాబాద్ రంజాన్ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. బందోబస్తు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆనంద్ గుండెపోటుతో మృతిచెందాడు. రంజాన్ ప్రత్యేక ప్రార్థనల సందర్భంగా ఖిల్లా ఈద్గా దగ్గర ట్రాఫిక్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విధులు నిర్వహిస్తున్న ఆనంద్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. పోలీస్ కమిషనర్ కార్తికేయ మృతుని కుటుంబాన్ని ఓదార్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
