ఓటు వేయలేదని బైక్‌తో మహిళను ఢీకొట్టిన సర్పంచ్!

ఓటు వేయలేదని బైక్‌తో మహిళను ఢీకొట్టిన సర్పంచ్!
X

ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఫ్యాక్షన్ గోడవలకు అజ్యం పోశాయి. దేవరకద్ర మండలం డోకూరు గ్రామంలో రాజకీయ పాతకక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఎన్నికల ఫలితాలలో తమ ఓటమిని అవహేళన చేశాడంటూ గ్రామానికి చెందిన బీజేపి నాయకుడు ప్రేమ్ కుమార్ అతని అనుచరులపై ప్రత్యర్థి టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు వీచక్షణ రహితం గొడ్డళ్ళు, కత్తులతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో ప్రేమ్ కుమార్ మృతి చెందగా... మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు.

మరో వైపు మహబూబ్ నగర్ మండలం రాంచంద్రపురం గ్రామంలో తమకు ఓటు వేయలేదనే కారణంతో ఇండిపెండెంట్ అభ్యర్థి తరుపు నాయకులు.. అధికార టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగారు. గ్రామ సర్పంచ్ కుమారుడు కుర్వ శ్రీను అతని అనుచరులు.. తమకు ఓటు వేయలేదని టీఆర్ఎస్ కార్యకర్త కమ్మరి ఆశోక్‌ను చితబాదారు. దింతో అపస్మారక స్థితిలో పడిఉన్న అతన్ని ఆసుపత్రికి తరలించారు స్థానికులు.

ఇదే గ్రామంలో ఓ వర్గానికి చెందిన మహిళను కూడా కుర్వ శ్రీను అనుచరులు బైక్ తో డీ కొట్టి చంపడంతో గ్రామంలో తీవ్ర కలకలం రేపాయి. ఆమె మృతికి సర్పంచ్ కుమారుడు కుర్వ శ్రీనే కారణమంటూ గ్రామస్థులంతా మహిళ శవంతో ఆందోళనకు దిగారు. గ్రామంలో ఫ్యాక్షన్ కక్షలకు తెరలేపిన సర్పంచ్ , అతని కుమారుడిని వెంటనే అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దింతో పోలీసులు భారీ ఎత్తున మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చి పికెట్‌ ఏర్పాటు చేశారు.

Tags

Next Story