జియో గుడ్ న్యూస్.. అదిరిపోయే ఆఫర్లు..

జియో గుడ్ న్యూస్.. అదిరిపోయే ఆఫర్లు..
X

రిలయన్స్ జియో తన యూజర్లకు అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. వరల్డ్ కప్‌ని దృష్టిలో పెట్టుకుని తన కస్టమర్ల కోసం వినూత్నమైన ఆఫర్లను అందిస్తోంది. దీని ద్వారా ఉచితంగా మ్యాచ్‌ని తిలకించొచ్చు, హాట్ స్టార్ సర్వీసులు, కొత్త రీచార్జ్ ప్లాన్, క్రికెట్ ప్లే వంటివి ఉన్నాయి.

జియో యూజర్లు వారి జియో టీవీ యాప్‌లోకి వెళ్లి మ్యాచ్‌లు చూడొచ్చు. అలాగే యూజర్లు వారి జియో టీవీ యాప్ ద్వారా లైవ్ స్ట్రీమ్ సౌకర్యం కూడా పొందొచ్చు. దీని ధర రూ.251. ప్లాన్ వాలిడిటీ 51 రోజులు. సబ్‌స్ర్కైబర్లకు 102 జీబీ 4 జీ డేటా లభిస్తుంది. దీంతో మ్యాచ్‌లు చూడొచ్చు.

వీటితో పాటు మై జియో యాప్ ద్వారా మరికొన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా మీరు మీ క్రికెట్ నాలెడ్జ్‌ని టెస్ట్ చేసుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్స్ చెబితే పాయింట్లు, బహుమతులు కూడా గెలుచుకోవచ్చు.

Next Story

RELATED STORIES