‘హిప్పీ’ మూవీ రివ్యూ

‘హిప్పీ’ మూవీ రివ్యూ
X

విడుదల తేదీ : జూన్ 06, 2019

నటీనటులు : కార్తికేయ, దిగంగా సూర్యవంశీ, జాబ్జా సింగ్, జెడి చక్రవర్తి, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు

దర్శకత్వం : టిఎన్ కృష్ణ

నిర్మాత : కలై పులి. థాను

సంగీతం : నివాస్ కె ప్రసన్న

సినిమాటోగ్రఫర్ : ఆర్ డి రాజేష్

ఎడిటర్ : ప్రవీణ్ కె ఎల్

ఆర్‌ఎక్స్ 100’ తో యూత్ కి దగ్గరయిన కార్తికేయ మరో ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హిప్పీ టైటిల్ యూత్ పుల్ గా ఉంది. ఆర్ ఎక్స్ 100 ఇమేజ్ పడకుండా కొత్త ప్రేమకథను అందించే ప్రయత్నం ట్రైలర్ లో కనిపించింది. కార్తికేయకు జంటగా దిగంగన సూర్యవంశి, జజ్బా సింగ్ నటించిన ఈ ప్రేమకథ ఎలా ఉందో చూద్దాం..

కథ :

దేవ్ (కార్తికేయ) ఆముక్తమాల్యద (దిగంగన సూర్యవంశి)ను చూసిన వెంటనే లవ్ లో పడిపోతాడు. అప్పటికే దేవ్ అముక్త ప్రేండ్ స్నేహతో (జజ్బా సింగ్) లవ్ లో ఉంటాడు. అముక్తను చూసాక తను లవ్ లో లేనని తెలుసుకుంటాడు. అముక్తకు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత దేవ్ ప్రేమను అముక్త యాక్పెప్ట్ చేస్తుంది. అక్కడి నుండి దేవ్ జీవితంలో ప్రేమ అంటే ఒక బంధీ అనే ఫీల్ కలుగుతుంది. ప్రేమనుండి పారిపోవాలనుకుంటాడు. కానీ అముక్త అతన్ని మరింత తన గ్రిప్ లోకి తెచ్చుకోవాలని ట్రై చేస్తుంటుంది. మరి ప్రేమలోనుండి బయటపడాలనుకుంటున్న దేవ్, ప్రేమలో ముంచాలనుకుంటున్న అముక్త ప్రయత్నాలు ఎలాంటి ఫలితాలను ఇచ్చాయి. అనేది మిగిలిన కథ..?

కథనం:

ఆర్ ఎక్స్ 100 వంటి సినిమాతో యూత్ కి కనెక్ట్ అయిన కార్తికేయ అల్ట్రా మోడ్రన్ గెటప్ లో మరోసార యూత్ ని ఎట్రాక్ట్ చేసాడు. హిప్పీ లంటే ఒక చోట నిలకడలేని జీవితం గడిపే వాళ్ళు.. హీరో ప్రేమకథ కూడా అలాంటిదే అవడం తో కాస్త టైటిల్ జస్టిఫికేషన్ కుదరింది. ఆల్రెడీ ఒక అమ్మాయితో పీకలలోతు ప్రేమలో ఉండి ఆ అమ్మాయితో రోడ్ మీద రోమాన్స్ చేసే కుర్రాడు అదే అమ్మాయి ప్రెండ్ ని చూడగానే ప్రేమిస్తాడు. ఇది ప్రేమ కాదు.. వ్యామోహం అని అనకునే ప్రేమను ఆడియన్స్ ని నిజమైన ప్రేమ అని కనెక్ట్ చేయడంలో దర్శకుడు టి.ఎన్. కృష్ణ సక్సెస్ అయ్యాడు. గాళ్ ఫ్రెండ్ ఎంగేజ్ మెంట్ కి వెళ్లడం, బాయ్ ఫ్రెండ్ ని భర్తకు పరిచయం చేయడం వంటి కల్చర్ రియల్ లైఫ్ చూసిన వాళ్ళకు హిప్పీ లోని ట్విస్ట్ లకు కనెక్ట్ అవుతారు. ఒక అమ్మాయిని ప్రేమించడం మొదలు పెట్టాక స్వర్గం లో ఉంటాము. అదే అమ్మాయి తిరిగి ప్రేమించడం మొదలు పెడితే స్వర్గం లోంచి బయటపడతాము. ఈ రెండు రియాలిటీ ల మద్య నడిచిన ప్రేమ కథలో కార్తికేయ , దిగంగా లు జీవించారు. వీరి ప్రేమలు, కోపాలు, బ్రేక్ అప్ లు అన్నీ మనకు కనెక్ట్ అవుతాయి. ప్రేమించిన ప్రతి వాడు స్వర్గంలో ఉన్నాడనే ఫీల్ ని ఆ అమ్మాయి కంట్రోల్ లోకి వెళ్లడం మొదలు పెట్టాక ఉక్కిరి బిక్కిరి అవుతాడు. ఇలాంటి సన్నివేశాల మద్య ప్రేమకథలోని మలుపులను రియలిస్టిక్ గా ఎంటర్ టైనర్ గా మలచడంలో టీం సక్సస్ అయ్యింది. ఈ ప్రేమకథలో ద్వందర్దాలు, శృతి మించిన మాటలు కథలో భాగం అయినా అవేమీ ప్రేమ కథలోని ఫీల్ ని చెడగొట్టలేదు. వెన్నెల కిషోర్ తనపాత్రతో బాగా ఎంటర్ టైన్ చేసాడు. అలాగే హీరోయిన్ దిగంగా తన పాత్రకు ప్రాణం పోసింది. అందం అభినయం కలగలిపిన ఈ అమ్మాయి ఈ సినిమాలో తన నటనతో మంచి స్కోర్ ని చేసింది. ఇక కార్తికేయ ఆర్ ఎక్స్ హండ్రండ్ ఛాయలు పడకుండా కొత్త పాత్రలో బాగా ఎంటర్ టైన్ చేసాడు. డాన్స్ లు, ఫైట్స్ లలో రెచ్చిపోయాడు. హుషారుగా కనిపించే పాత్రలో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. జెడీ చక్రవర్తి కార్తకేయ కు మెంటర్ కమ్ బాస్ గా కనిపించాడు. అతని డైలాగ్స్ బగున్నాయి. తెలంగాణా మాడలికం తెచ్చి పెట్టుకున్నట్లుంది. అలాగే ఈ ప్రేమకథకు ఆర్ డి రాజేష్ సినిమాటోగ్రఫీ మరింత అందాన్ని తెచ్చింది. ప్రేమించిన అమ్మాయి నుండి పారిపోవాలనుకునే కుర్రాడు ఆ అమ్మాయి ప్రేమలోంచి వెళ్ళలేని పరిస్థితుల్లోకి ఎలా వచ్చాడు..? అనేది పాయింట్ ని చాలా రియలిస్టిక్ అప్రోచ్ తో నడిపాడు దర్శకుడు. యూత్ కి కనెక్ట్ అయ్యే అంశాలు మెండు గా ఉన్న ఈ ప్రేమకథలో ఎమోషనల్ పాయింట్స్ ఆకట్టుకుంటాయి. ఏ రిలేషన్ లో అయితే గొడవలు ఎండ్ అవుతాయో వారి మద్య ప్రేమకూడా ఎండ్ అవుతుంది అనే మాటలు ఆకట్టుకున్నాయి. హిప్పీ సెకండాఫ్ లో కాస్త కథనం మందగించినట్లు అనిపించినా, వారి ప్రేమకథ ఎక్కడా గ్రిప్ కోల్పోలేదు. క్లైమాక్స్ ని దర్శకుడు డిజైన్ చేసిన విధానం చాలా బాగుంది. ఫార్మెట్ బ్రేకింగ్ కథనంతో హిప్పీ చాలా ఏంగేజింగ్ గా సాగింది. కొత్త తరం ఆలోచనలకు దగ్గరగా ఉండే ఈ ప్రేమకథ తో యూత్ ఎంటర్ టైన్ అవుతారు.

చివరిగా:

బోల్డ్ ఎంటర్ టైనర్

Next Story

RELATED STORIES