'కిల్లర్' తో బిచ్చగాడి మార్కెట్ ఖతమా..?

కిల్లర్ తో బిచ్చగాడి మార్కెట్ ఖతమా..?
X

వచ్చిన ఇమేజ్ ను కాపాడుకోవడం ఎంత కష్టమో ఏ హీరోను అడిగినా చెబుతారు. అసలు యాక్టింగ్ పరంగా టెన్ మార్క్స్ కూడా తెచ్చుకోలేని హీరోకు, లక్కీగా ఓ మంచి కథ పడి.. హిట్ వచ్చి.. ఇమేజ్ పెరిగిందంటే.. ఆశ్చర్యమే. అయితే ఆ ఇమేజ్ ను కూడా కాపాడుకోలేక.. సినిమా సినిమాకూ దిగజారుతోన్న ఈ బిచ్చగాడు.. రేపు కిల్లర్ గా వస్తున్నాడు. ఇప్పటికే ఈయన్నుంచి వచ్చిన డిజాస్టర్స్ ను బట్టి చూస్తే.. ఈ కిల్లర్ కు వెళ్లిన వాళ్ల పరిస్థితేంటో ఊహించుకోవచ్చు.. దీనికి తోడు ఆల్రెడీ కిల్లర్ పై వస్తోన్న వార్తలు వింటే.. సినిమా రిజల్ట్ ఎక్స్ పెక్ట్ చేయడం పెద్ద కష్టమేం కాదంటున్నారు.. మరి కిల్లర్ పరిస్థితేంటీ..?

విజయ్ ఆంటోనీ.. మొదట్లో కొన్ని డబ్బింగ్ సినిమాలతో ఆకట్టుకున్నాడు. బిచ్చగాడు సినిమాతో తెలుగులో మంచి మార్కెట్ కూడా తెచ్చుకున్నాడు. మనోడి యాక్టింగ్ స్కిల్ ఏమీ లేకపోయినా.. బలమైన కథ కావడంతో బిచ్చగాడు బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించింది. దీంతో ఇక విజయ్ ఆంటోనీ సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనుకున్నారు బయ్యర్స్ అండ్ ఆడియన్స్. బట్.. వారి అంచనాలు తప్పడానికి ఎక్కువ సినిమాలేం పట్టలేదు. బిచ్చగాడు తర్వాత అతను చేసిన ఏ ఒక్క సినిమా కూడా ఆకట్టుకోలేదు.. ఆడలేదు. తెలుగులోనే కాదు.. తమిళ్ లోనూ అదే పరిస్థితి ఉండటం విశేషం.

బిచ్చగాడు తర్వాత ట్రైలర్ తో ఆకట్టుకోవడం..సినిమాతో టార్చర్ పెట్టడం విజయ్ ఆంటోనీ స్పెషాలిటీగా మారింది. ఈ క్రమంలోనే వరుసగా ఆరు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దీంతో నిర్మాతగానూ పూర్తిగా డీలాపడిపోయాడు విజయ్. ఇక ఇప్పుడు కిల్లర్ అనే సినిమాతో వస్తున్నాడు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా కూడా ట్రైలర్ హడావిడీ తప్ప అసలు మేటర్ లేదని ఇప్పటికే కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

వరుసగా హత్యలు చేసే హీరో.. అతన్ని పట్టుకోవడానికి వెంటానే పోలీస్.. ఇదే కథ. ఈ కథ ఇప్పటికే వందల సార్లు చూశారు ఆడియన్స్.. ఇక ఇప్పుడు విజయ్ ఆంటోనీ స్టోరీ సెలెక్షన్ చూస్తే ఇదెంత చప్పగా ఉంటుందో ఈజీగా ఊహించొచ్చు. ఇప్పటికే తెలుగులో పూర్తిగా మార్కెట్ కోల్పోయిన విజయ్‌కి ఇదే చివరి అవకాశం అని అటు బయ్యర్స్ కూడా అనుకుంటున్నారు. పైగా ఈ మూవీకి అస్సలు క్రేజ్ కూడా లేదు. ఇటు విజయ్ కానీ, అటు అర్జున్ కానీ సినిమాకు ఏ మాత్రం అట్రాక్టివ్ ఫ్యాక్టర్ కాలేకపోయారు. మొత్తంగా కిల్లర్ తో విజయ్ ఆంటోనీ ఎప్పట్లానే ఆడియన్స్ అంచనాలను కిల్ చేస్తాడనే టాక్ మాత్రం బాగా వినిపిస్తోంది.

Next Story

RELATED STORIES