ఆర్థిక మంత్రిగా ఆమె తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి

ఆర్థిక మంత్రిగా ఆమె తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి
X

పూర్తిస్థాయి తొలి ఆర్థిక మహిళా మంత్రిగా పదవి చేపట్టిన నిర్మలా సీతారమన్‌.. మంత్రిగా తనదైన ముద్ర వేస్తున్నారు. గతంలో కేంద్ర రక్షణ మంత్రిగా కీలక నిర్ణయాలు తీసుకుని ప్రత్యేకంగా నిలిచిన ఆమె.. ఇప్పుడు ఆర్ధిక మంత్రిగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. జూన్ 8 నుంచి ప్రారంభమయ్యే జి-20 దేశాల ఆర్థికమంత్రులు, సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్ల సమావేశంలో ఆమె పాల్గోనున్నారు..

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ జి-20 సమిట్‌కు హాజరుకానున్నారు. కేంద్ర ఆర్థికమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిర్మలా సీతారామన్‌కు ఇది తొలి విదేశీ పర్యటన ఇదే..

జి-20 దేశాల ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం జూన్‌ 8న ప్రారంభం కానుంది. జపాన్‌లోని ఫుకవొకా నగరంలో జరిగే ఈ మీటింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్లు ఎదుర్కొంటున్న సవాళ్లు, మౌలిక రంగం, పన్నుల అంశాల్లో నెలకొన్న సంక్లిష్టతలపై చర్చించనున్నారు. కొన్ని దేశాలు వాణిజ్య విధానాల్లో అవలంబిస్తున్న రక్షణాత్మక ధోరణి- అంతర్జాతీయ వ్యాపారంపై ప్రభావాన్ని కూడా చర్చించనున్నారు. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి రేటును ఐఎమ్‌ఎఫ్‌ 3.6 శాతం నుంచి 3.3 శాతానికి తగ్గించిన వేళ ఈ సదస్సు ప్రాధాన్యం సంతరించుకుంది.

జపాన్‌లోని ఫ్యూకూవోకా సిటీలో రెండురోజులపాటు జీ-20 ఆర్థిక మంత్రుల సమావేశం జరగనుంది. జూన్ 8, 9 తేదీల్లో జీ-20 ఆర్థిక మంత్రుల సమావేశంలో సెంట్రల్‌ బ్యాంకు గవర్నర్స్ పాల్గొననున్నారు. నిర్మలా సీతారామన్‌తోపాటు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా జీ-20 ఆర్థిక మంత్రుల సమావేశానికి హాజరుకానున్నారు.

Next Story

RELATED STORIES