కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కి ఢిల్లీ కోర్టులో ఊరట

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కి ఢిల్లీ కోర్టులో ఊరట
X

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌‌కి ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. ప్రధాని నరేంద్ర మోదీని శివలింగంపై కూర్చున్న తేలుతో పోల్చడంపై దాఖలైన పరువునష్టం కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది. వ్యక్తిగత పూచీకత్తు కింద 20 వేలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. శశిథరూర్‌పై ఢిల్లీ బీజేపీ నేత రాజీవ్ బబ్బార్ ఈ పరువునష్టం కేసు దాఖలు చేశారు. శుక్రవారం విచారణకు హాజరైన శశిథరూర్.. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు.

గతేడాది అక్టోబర్‌లో బెంగళూరు వేదికగా జరిగిన లిటరేచర్ ఫెస్టివల్‌లో శశిథరూర్ మాట్లాడుతూ.. బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్‌ మాటను మోదీ వినే పరిస్థితుల్లో లేరని అర్ధం వచ్చేలా విమర్శలు చేశారు. ‘‘మోదీ శివలింగంపై కూర్చున్న తేలు వంటివారు. చేత్తో తొలగించలేరు, చెప్పుతో కొట్టనూ లేరు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. శశిథరూర్ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేసింది.

Next Story

RELATED STORIES