వాటిపై దృష్టి పెట్టాలి - పవన్ కళ్యాణ్

వాటిపై దృష్టి పెట్టాలి - పవన్ కళ్యాణ్
X

ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి తేరుకున్న పవన్‌ కళ్యాణ్‌.. ఇప్పుడు పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జిల్లాల వారీగా రివ్యూలు చేస్తున్నారు. ఓటమికి కారణాలు.. ఫలితాల తరువాత జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై ఆరాతీస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం జిల్లా నేతలతో సమావేశమయ్యారు జనసేన అధినేత. శ్రీకాకుళంలో ఓటమికి కారణాలను నేతలు వివరించారు. ఈ సందర్భంగా ఎవరూ అధైర్య పడాల్సిన పని లేదని.. కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని ధైర్యం చెప్పారు. అంతా స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టాలని పిలుపు ఇచ్చారు.

Tags

Next Story