జగన్ కేబినెట్ రెడీ.. 25 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం

వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం... ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనునున్నారు ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి తన మంత్రి వర్గాన్ని రేపు విస్తరించనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఉదయం పది గంటలకు జరిగే ఈ భేటీకి... 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.

మంత్రి వర్గంలో ఎవరెవరికి చోటు లభిస్తుందన్నదానిపై ఈ సమావేశంలో సీఎం జగన్‌ క్లారీటి ఇచ్చే అవకాశం ఉంది. మంత్రివర్గ కూర్పు విషయంలో ప్రాంతీయ, సామాజిక వర్గాల మధ్య పాటించాల్సిన సమతుల్యం, పార్టీలో తీసుకురావాల్సిన మార్పుల గురించి ఎమ్మెల్యేలకు వివరించనున్నారు. మంత్రివర్గాన్ని విడతల వారిగా కాకుండా... ఒకేసారి ప్రకటించాలని సీఎం జగన్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రేపు మొత్తం 25 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించే అవకాశాలున్నాయి.

ఇక ఇవాల్టి వైసీపీఎల్పీ సమావేశంలో మంత్రులతో పాటు అసెంబ్లీ స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ వంటి పదవుల ఎంపికపైనా స్పష్టత రానుంది. మరోవైపు తొలి మంత్రివర్గ సమావేశం ఈ నెల 10 తేదీన... రాష్ట్ర సచివాలయంలో జరగనుంది. ఇందులో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. వారం రోజులుగా సమీక్షలు చేస్తోన్న సీఎం జగన్‌... ఇందులో కొన్ని అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story