అత్తపై కోడలి దాష్టీకం.. జుట్టు పట్టుకొని దారుణంగా..

అత్తపై ఓ కోడలు కర్కశత్వం ప్రదర్శించింది. వృద్ధురాలు అని కూడా చూడకుండా చిత్రహింసలు పెట్టింది. ఇష్టం వచ్చినట్లుగా ఆమెను కొడుతూ పైశాచికంగా ప్రవర్తించింది. మంచంపై పడుకున్న అత్తను పట్టుకొని బూతులు తిడుతూ, చితకబాదింది.
హర్యానాలోని మహేంద్రఘడ్ జిల్లా నైవాజ్ నగర్‌కు చెందిన చాంద్ బాయి ఉదంతం ఇది. వయోభారంతో బాధపడుతూ, తన మానాన తాను మంచంపై పడుకున్న చాంద్ బాయిపై ఆమె కోడలు అమానుషంగా దాడి చేసింది. ఈ ఉదంతాన్ని స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో కోడలి కర్కశత్వం వెలుగుచూసింది.
చాంద్‌బాయీ గతంలో ఆజాద్ హింద్ ఫౌజ్‌లో పని చేసినట్లు సమాచారం. ఆమెకు ప్రతి నెల 30 వేల రూపాయల పెన్షన్ కూడా వస్తుంది. చాంద్‌బాయీ కోడలి కర్కశత్వంపై హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తీవ్రంగా స్పందించారు. సభ్యసమాజంలో ఇలాంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదన్నారు. ఇక, వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలని అరెస్టు చేశారు. బాధితురాలిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com