తాజా వార్తలు

సొంత పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన వీహెచ్

సొంత పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన వీహెచ్
X

కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సొంత పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు న్యాయం జరగటం లేదని ఫైర్ అయ్యారు ఆయన. జనాలకు తెలియని వ్యక్తులు కూడా గుట్టుచప్పుడు కాకుండా ఢిల్లీ వెళ్లి పదవులు తెచ్చుకునే కల్చర్ పెరిగిపోతుందని విమర్శించారు. టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ భట్టి విక్రమార్క చేస్తున్న ప్రజాస్వామ్య పరిరక్షణ సత్యాగ్రహం దీక్షలో పాల్గొన్నారాయన. ఓ దళిత నేత పార్టీ కోసం పోరాడుతుంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు మద్దతుగా దీక్షలో పాల్గొనలేదని ప్రశ్నించారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇన్ చార్జ్ కుంతియాకు స్టేజి మీద నుంచే షాకిచ్చారు. దీక్షకు హజరుకాని వాళ్ల నుంచి సంజాయిషీ తీసుకోవాలని కుంతియాను కోరారు.

Next Story

RELATED STORIES