ఏపీ తొలి కేబినెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకోనున్న ప్రభుత్వం

ఏపీ క్యాబినెట్‌ తొలి సమావేశం ఈ నెల 10 వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది ప్రభుత్వం. ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై మంత్రివర్గం చర్చించనుంది. దీంతో పాటు సీపీఎస్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోనుంది. ఇక ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ను ఈ సమావేశంలో ఆమోదించే అవకాశం ఉంది. దీంతో పాటు ఆశావర్కర్ల జీతాలు 7వేల నుంచి 10 వేలకు పెంపు, వృద్ధ్యాప్య పెన్షన్లు 2వేల 250 రూపాయలు పెంపు వంటి అంశాలను ఈ సమావేశంలో ఆమోదిస్తారు. వీటితో పాటు పారిశుద్ధ్య కార్మికులు, హోంగార్డులు జీతాల పెంపుపైనా నిర్ణయం తీసుకోనున్నారు. ఇక రైతు భరోసా పథకం అమలకు అనుమతి ఇవ్వనుంది కేబినెట్‌. అక్టోబర్‌ నుంచి రైతుభరోసా కింద అన్నదాతలకు 12 వేల 500 రూపాయలు ఇవ్వనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story