ధావన్ శతకం..వన్డే కెరీర్‌లోనే..

X
TV5 Telugu9 Jun 2019 2:07 PM GMT
ప్రపంచకప్ రెండో మ్యాచ్‌లోనూ టీమిండియా బ్యాట్స్‌మెన్ అదరగొట్టారు. ఓపెనర్లతో పాటు టాపార్డర్ సమిష్టిగా రాణించడంతో ఆసీస్ ముందు భారత్ 353 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. బ్యాటింగ్‌లో పూర్తి ఆధిపత్యం కనబరిచిన ఓపెనర్లు ధావన్,రోహిత్‌శర్మ తొలి వికెట్‌కు 127 పరుగులు జోడించారు. రోహిత్ ఔటైనా... శిఖర్ ధావన్ సెంచరీతో చెలరేగాడు. వన్డే కెరీర్‌లో ధావన్‌కు ఇది 17వ శతకం కాగా ప్రపంచకప్‌లో మూడో సెంచరీ. తర్వాత కోహ్లీ , పాండ్యా కూడా రెచ్చిపోవడంతో భారత్ భారీస్కోర్ చేసింది. ఆరంభంతో పాటు మిడిల్ ఓవర్స్‌లో కోహ్లీ,ధావన్ పార్టనర్‌షిప్, చివర్లో పాండ్యా మెరుపులు టీమిండియా భారీస్కోరుకు కారణంగా చెప్పొచ్చు. ధావన్ 117 , కోహ్లీ 82 , పాండ్యా 48 పరుగులు చేయగా... ఆసీస్ బౌలర్లలో స్టోనిస్ 2 వికెట్లు పడగొట్టాడు. కాగా ప్రపంచకప్‌లో టీమిండియాకు ఇది నాలుగో హయ్యెస్ట్ స్కోర్.
Next Story